సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు ఉన్నారు . కొత్త ముద్దుగుమ్మలు వస్తున్నారు . కానీ పాత హీరోయిన్స్ అంటేనే పడి చచ్చిపోతున్నారు అభిమానులు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ అంటే జనాలకు విపరీతమైన ఇష్టం .ఆ అందం ..దానికి తగ్గ ఫిజిక్ .. నిజమైన చందమామ ఇలానే ఉంటుందేమో అనేంతలా ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ..మొదటి సినిమాతోనే క్లాసిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .
ఈ సినిమాలో కాజల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హిట్లు ప్లాపులు అనే తేడా లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ క్రేజీ క్రేజీ ఆఫర్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ఈ క్రమంలోని తెలుగు – తమిళ్- హిందీ భాషల్లో సినిమాల్లో నటించి మూడు ఇండస్ట్రీలను ఊపేసింది. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ,ప్రభాస్ ,మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో జతకట్టి సూపర్ సక్సెస్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.
కాగా కెరియర్ పిక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ పెళ్లయి ఏడాది కాక ముందే అభిమానులకు గుడ్ న్యూస్ అందించే డబుల్ ప్రమోషన్ ని అందుకుంది. అంతేకాదు రీసెంట్ గానే పండింటి బాబుకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ పై పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది . ఈ క్రమంలోనే డెలివరీ తర్వాత తన బాడీని హాట్ గా మార్చుకున్న ఈ బ్యూటీ కి హీరోయిన్ గా కూడా అవకాశాలు వస్తున్నాయి.
ఇలాంటి టైంలో తన భర్త గౌతమ్పెట్టిన కండిషన్స్ కి ఓకే చెప్పి యాక్సెప్ట్ చేసి అభిమానుల గుండెల్లో మంట పుట్టించింది కాజల్ అగర్వాల్. సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ మాత్రమే చేయమన్నారట . అంతేకాదు పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు చేయాలే తప్పిస్తే ఎక్స్పోజింగ్ చేయకు అంటూ కండీషన్ పెట్టారట . అంతేకాదు అలా నటిస్తేనే సినిమాలో కి వెళ్లు.. లేదంటే వద్దు బాబును చూసుకో అంటూ చెప్పుకొచ్చారట .ఈ క్రమంలోనే భర్త కండిషన్ లో న్యాయం ఉంది కదా అంటూ భావించిన కాజల్ అతని మాటకు నో చెప్పలేదట. ఈ క్రమంలోని ఆమెకు హీరోయిన్గా వచ్చిన అవకాశాలు అన్నీ వదులుకొని కేవలం పాత్రకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ మాత్రమే చూస్ చేసుకుంటుంది కాజల్ . కా జల్ దగ్గర నుండి ఈ ట్వీస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం అంటూ అభిమానులు అంటున్నారు.