టాలీవుడ్‌లో దిల్ రాజు టార్గెట్‌గానే ఇంత‌ ర‌చ్చ జ‌రుగుతోందా…!

టాలీవుడ్ లో మ‌రో నెల రోజుల‌లో సంక్రాంతి యుద్ధం మొద‌లు కానుంది. ఈ సీజ‌న్‌లో చాలా వ‌రకు పెద్ద హీరోల సినిమాలు బ‌రిలో ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా నెల‌ ముందు నుంచే సంక్రాంతి స‌మ‌రం టాలీవుడ్- కోలివుడ్ లో హ‌ట్ టాపిక్‌గా మారడం చర్చనీయాంశంగా మ‌రింది. వ‌చ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలు పోటీపడబోతున్నాయి. 2017లో పోటిప‌డిన సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మ‌ళ్ళీ ఇప్పుడు పోటీపడబోతున్నారు.

వాల్తేరు వీరయ్య: నిజంగానే అలాంటి పని చేసిన చిరు..బాబీని బూతులు తిడుతున్న  మెగా ఫ్యాన్స్..!! - Telugu Lives

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న భారీ య‌క్ష‌న్ సినిమా ‘వాల్తేరు వీరయ్య. ఇక ఈ సినిమాను టాలీవుడ్ యంగ్ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ‘. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు టాలీవుడ్ మ‌రో సీనియ‌ర్ హీరోయిన నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహారెడ్డి సినిమా కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ‘క్రాక్’తో ట్రాక్ లోకి వ‌చ్చిన‌ గోపీచంద్ మలినేని ఈ సినిమా డైరెక్ట‌ర్‌. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ హైవోల్టేజ్ యాక్షన్ సినిమా ఇదని క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

Veera Simha Reddy Motion Poster | Nandamuri Balakrishna | Shruti Haasan |  Gopichandh Malineni - YouTube

ఈ రెండు సినిమాలతో పాటు దిల్ రాజు తమిళ హీరో విజయ్ తో నిర్మిస్తున్న ‘వారీసు’ని తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’గా సంక్రాంతి బరిలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో పాటు దిల్ రాజు ‘తునీవు’ని కూడా ఇదే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారట. అజిత్ హీరోగా హెచ్. వినోద్ రూపొందిస్తున్న ఈ మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి డబ్బింగ్ సినిమాలకు పండగ సీజన్ లో ప్రధాన్యతన ఇవ్వరాదని థియేటర్లు కేటాయించరాదని ఓ ప్రకటనని విడుదల చేసింది.

Thalapathy Vijay's Varisu Trapped In A Five-Way Box Office Clash,  Producer-Distributor Dil Raju In Worry?

ఇక ఈ సంక్రాంతికి ఒకేసారి ‘వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి’ సినిమాలు రిలీజ్ కు రెడీ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వారు స్పందించడం కానీ.. డబ్బింగ్ సినిమాల వల్ల తమ రెండు సినిమాలకు ఎఫెక్ట్ అవుతాయని కానీ ప్రకటన చేయలేదు.. మరి సంక్రాంతి బరిలో దిగుతున్న డబ్బింగ్ సినిమాలపై రచ్చ చేస్తోంది ఎవరు?.. దిల్ రాజు- మైత్రీ వారికి లేని దురద ఇంకెవరికుంది?.. కావాలనే దీన్ని ఇష్యూ చేస్తున్నారా? ..దిల్ రాజుని టార్గెట్ చేయాలనే డబ్బింగ్ సినిమాల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారా? అనే అనుమానాలు వ‌స్తున్న‌యి.

Share post:

Latest