తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఐశ్వర్య రాజేష్. తెలుగు- తమిళ్ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈమె హీరోయిన్ పాత్రలే కాకుండా ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలు చేయడానికి కూడా ఒప్పుకుంటుంది. అందుకే ఈమె ఈ రెండు పరిశ్రమలలో బిజీ స్టార్ గా కొనసాగుతుంది. తన నటనతో ఐశ్వర్య అనుకుంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకుంది.
ఈమె గురించి అందరికీ తెలుసు కానీ ఈమె ఫ్యామిలీ విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు.. తెలిస్తే మాత్రం ఎవరికీ కన్నీళ్లు రాకుండా ఉండవు. ఈమె చిన్న వయసులోనే తన తండ్రిని పోగొట్టుకుంది. ఆ తర్వాత ఈమె సోదరులు కూడా కోల్పోయింది ఐశ్వర్య. ఈమె తండ్రి రాజేష్ కూడా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్న సమయంలోనే మత్తు వ్యసనాలకు బానిసైన రాజేష్ అవి అమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం క్షీణించి మరణించారు. ఇక రాజేష్ సోదరి కూడా తెలుగులో స్టార్ కమెడియన్ యాక్టర్. ఆమె కూడా మనందరికీ తెలిసిన ప్రముఖ నటి లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయాలన్నీ చెప్పింది. తన మేనకోడలు ఐశ్వర్య రాజేష్ మాత్రమే ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా హీరోయిన్గా రాణిస్తుందంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించింది.
ఐశ్వర్య అన్నలు కూడా చిన్న వయసులోనే చనిపోయారని ఈమె చెప్పింది. అ విషయం చెప్పడంతో ఆ ఇంటర్వ్యూలో ఉన్న వారందరూ కొంత బాధకు లోనయ్యారు. మరి అన్నలు కూడా 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఒకరు యాక్సిడెంట్ కారణంగా… మరొకరు సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఐశ్వర్య రాజేష్ ఇంట్లో మగదిక్కు లేకుండా పోయింది అంటూ చెప్పి బాధపడింది.