వారెవ్వా ..ఈ న్యూస్ విన్న నందమూరి అభిమానులు ఎవరైనా సరే పూనకాలు వచ్చినట్లు ఊగిపోవాల్సిందే .నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చలామణి అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . నందమూరి తారక రామారావు గారి తర్వాత అలాంటి స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక నటుడు నటసింహం బాలకృష్ణ. ఇక ఆ తర్వాత అంతటి ఘనత సాధించిన హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు జూనియర్ ఎన్టీఆర్.
కాగా ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న వారసుడు మోక్షజ్ఞ . బాలయ్య వన్ అండ్ ఓన్లీ సన్ ఎప్పుడెప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడా అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఈగర్ గా వైట్ చేస్తున్నారు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉండబోతున్నట్టు తెలుస్తుంది . ఇప్పటికీ మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి .కానీ ఈసారి పక్కా ప్లానింగ్ తో బాలయ్య రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది . ఆయన గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
కాగా మోక్షజ్ఞ ఆదిత్య 369 సినిమా సీక్వెల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది . అయితే ఆదిత్య 999 పేరుతో ఈ సీక్వెల్ రానుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ సీనియర్ హీరోయిన్ రోజా కూతురు అన్షు మాలిక ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . తెర పై బాలయ్య-రోజా జంట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . వీళ్ళ కాంబోలో సినిమా వచ్చిందంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే . ఇప్పుడు వారి వారసులు జత కట్టబోతున్నారు అంటే అది నిజంగా ఓ సంచలనం అనే చెప్పాలి .
కాగా అన్షు మాలిక కూడా ఈ సినిమా ద్వారానే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హీరోయిన్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ని చక్కగా నేర్చుకున్న అన్షు..త్వరలోనే మోక్షజ్ఞతో రొమాన్స్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే ఇద్దరు స్టార్ కిడ్స్ కలిసి తెరపై నటిస్తే ఆ కిక్కే వేరు ..అందులోను స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నందమూరి హీరోతో అన్షు మాలిక ఎంట్రీ ఇస్తే ఆమె కెరియర్ కి ఇక తిరుగు ఉండదు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . మరి చూడాలి ఈ న్యూస్ పై రోజా – బాలకృష్ణ ఎలా స్పందిస్తారో..?