థియేటర్లో ఓ సినిమా ఆడిన విధానాన్ని బట్టి సినిమా హిట్టని చెప్పే రోజులనుండి ఓ బుల్లితెరలో సినిమా చూసి హిట్టని చెప్పే రోజుల్లోకి వచ్చేసాము. అదేనండి ఓటీటీలో ఈమధ్య కొన్ని సినిమాలు దుమ్ము దులుపుతున్నాయి. ఇక ఒక సినిమాకు డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కు కూడా భారీగా బిజినెస్ జరుగుతుంది. కాబట్టి.. సో కాల్డ్ సినిమాలు ఓటీటీ, స్మాల్ స్క్రీన్ ల పై కూడా బాగా ఆడాల్సిన అవసరం ఎంతైనా వుంది. అయితే నేడు థియేటర్లో సక్సెస్ అయినంత మాత్రాన డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ రూపంలో సినిమా సక్సెస్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి వుంది.
అలాగే థియేటర్లో అందనంత మాత్రాన ఓటీటీలో ఆడదు అనుకుంటే పొరపాటే. అయితే ఇలాంటి తరుణంలో కొన్ని పైరసీ సైట్స్ లో సినిమా హై క్వాలిటీ వెర్షన్ తో అందుబాటులోకి వచ్చేస్తుండంతో ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా సినిమాని మొబైల్స్ లో ఎన్నిసార్లయినా జనాలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయితే ఈ విషయాన్ని పక్కన బెడితే కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడనవి ఓటీటీల్లో సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇపుడు అలాంటి సినిమాలను ఒకసారి చూద్దాం రండి.
సందీప్ కిషన్ హీరోగా A1 ఎక్స్ ప్రెస్ అనే సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు కానీ ఓటిటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అలాగే అనన్య నాగళ్ళ ప్రధాన పాత్ర పోషించిన ‘ప్లే బ్యాక్’ మూవీ.. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఓటీటీ జనాలకు బాగా నచ్చింది. ఈ మూవీ ‘ఆహా’ లో అందుబాటులో ఉంది. అలాగే శర్వానంద్ హీరోగా కిషోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీకారం’ సినిమా కూడా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక నాగార్జున హీరోగా ఆశిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ‘వైల్డ్ డాగ్’ మూవీ థియేటర్లలో ప్లాప్ కానీ ఓటీటీలో సూపర్ హిట్. దీన్ని బట్టి అర్ధం అయ్యింది ఏమంటే ఇపుడు కేవలం థియేటర్లలో సినిమా ఆడనంత మాత్రాన ఆ సినిమా ప్లాప్ కాదని అర్ధం.