ఎన్నిసార్లు చూసినా కొత్త ఫీలింగ్.. జన్మలో మర్చిపోలేను.. సెకండ్ ఇన్నింగ్స్ లో టూ రొమాంటిక్ గా రెచ్చిపోతున్న త్రిష ..!?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు ఎప్పటికీ చెరిగిపోవు . రిలీజ్ అయ్యి 20 , 30 సంవత్సరాలు అవుతున్నా సరే వాటిని ప్రేక్షకులు బాగా గుర్తు పెట్టుకొని ..ఆ హీరో హీరోయిన్ల కి చెరిగిపోని జ్ఞాపకాలను గుర్తుగా ఇస్తుంటారు . ఈ క్రమంలోనే “వర్షం” సినిమా కూడా అలాంటి ఓ చెరగని జ్ఞాపకాన్ని ఇచ్చింది హాట్ బ్యూటి త్రిషకి. ప్రభాస్ – త్రిష జంటగా కలిసిన నటించిన సినిమా వర్షం . జనవరి 14 , 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది .

ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పటికి ప్రభాస్ కెరియర్లో టాప్ 10 సినిమాలలో వర్షం సినిమా ముందు వరుసలో ఉంటుంది. కాగా ఈ సినిమా రీసెంట్ గానే 4కె వర్షెన్ లో రిలీజ్ అయ్యి.. అప్పుడు సంచలన రికార్డును నెలకొల్పింది. కాగా ఈ క్రమంలోనే త్రిష తన వర్షం సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ పెడుతూ..ఎమోషనల్ అయ్యింది.

” ఈ సినిమా నిన్న కాక మొన్న రిలీజ్ అయినట్లు ఉంది . ఈ సినిమా లో నేను నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. మరి ముఖ్యంగా ప్రభాస్ తో కలిసినటించడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. గోపీచంద్ విలనిజం ..ప్రభాస్ నటన..డైరెక్టర్ శోభన్ డైరెక్షన్ ..దేవిశ్రీప్రసాద్ పాటలు సినిమాకి మరింత కొత్త ఊపునిచ్చాయి. ఈ సినిమా రిలీజ్ అయి 18 ఏళ్లు గడుస్తుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ సినిమా ఇప్పటికీ చూస్తున్న అదో తెలియని కొత్త ఫీలింగ్ ..మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తూ ఉంటుంది . అలాంటి ఓ సినిమాను నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ శోభన్ కి స్పెషల్ థాంక్స్” అంటూ వర్షం సినిమాపై ఎమోషనల్ నోట్ రాసుకోచ్చింది. రీసెంట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన త్రిష ..పోనియన్ సెల్వన్ పార్ట్-1 తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకునింది. అంతేకాదు ప్రజెంట్ త్రిష చేతుల్లో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లోను ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది త్రిష.

Share post:

Latest