యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సందD` సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు పరిచయమైంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీలీలకు ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కొడుతున్నాయి.
ఈ అమ్మడు చేతిలో దాదాపు అర డజన్ తెలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న `ఎస్ఎస్ఎమ్‌బీ 28` లోనూ ఈమెకు అవకాశం వచ్చిందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో ఆల్రెడీ పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది. సెకండ్ హీరోయిన్ కోసం శ్రీలీలను సంప్రదించారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అభిమానులు మాత్రం ఈ ఆఫర్ వదులుకోవడమే శ్రీలీలకు మంచిదని సూచనలు చేస్తున్నారు.
అందుకు కారణం లేకపోలేదు.. త్రివిక్రమ్ సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ గా నటిస్తే ఇక వారికి కెరీర్ ఉండదు. ఇండస్ట్రీలో ఇది ఒక బ్యాడ్ సెంటిమెంట్ గా మారింది. దీంతో ఇప్పుడు మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా తీసుకునేందుకు శ్రీలీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో అనే మోజుతో మహేష్ సినిమాకు ఒప్పుకుని తప్పు చేయొద్దు శ్రీలీల అంటూ ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి శ్రీలీల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది.