జాన్వీ బాత్ రూమ్ సీక్రెట్ ను బయటపెట్టిన బోనీ కపూర్.. పరువు తీయకంటూ కూతురు సీరియస్!

బాలీవుడ్ సూపర్ డాడ్ అండ్ క్యూట్ డాటర్ గా బోని కపూర్ మ‌రియు జాన్వీ కపూర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రొడ్యూసర్ గా ఆయన హీరోయిన్ గా ఈమె వరస‌ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా మంచి సక్సెస్ ను అందుకుంటున్నారు. జానీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా తండ్రి నిర్మాణంలో ఒక సినిమా కూడా చేయలేదు.

అయితే ఇటీవల ఫస్ట్ టైం `మిలి` అనే సినిమా చేసింది. మలయాళ సూపర్ హిట్ సినిమా హెలెన్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన `మిలి` సినిమా శుక్రవారం రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ మరియు బోనీ కపూర్ లు కలిసి పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

తాజాగా బాలీవుడ్ క్రేజీ టాక్ షో కపిల్ శర్మ టాక్ షోలో పాల్గొన్న వీరిద్దరి గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు రాబట్టే ప్రయత్నంలో.. తన బెడ్ రూమ్ ఎలా ఉంటుంది? మరియు బాత్ రూమ్ ఎలా ఉంటుంది? అని బోనీ కపూర్ ను ప్రశ్నించాడు కపిల్ శర్మ. బోనీ కపూర్ ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. జాన్వి బాత్ రూమ్ లో ఎక్కడి బట్టలు అక్కడే ఉంటాయని.. పేస్ట్ క్యాప్ తీసి ఉంటుందని చెప్పుకొచ్చాడు. అస్సలు రూమ్ నీట్ గా ఉంచుకోదని ఏ వస్తువులు కూడా వరుసగా పెట్టదని చెప్పగా దాంతో చిరాకు పడ్డ జాన్వి డాడీ నా పరువు తీయకు అంటూ బోనీ పై సీరియస్ అయ్యింది.

బోనీ కపూర్ ఎక్కడ జాన్వి సీక్రెట్స్ అన్ని బయట పెడతాడు అన్న‌ట్టు.. తన తండ్రిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది.అంతేకాకుండా తన కూతురికి నచ్చిన కథనాలను చేసుకుంటూ.. తన సినీ కెరీర్ పై చాలా సంతృప్తిగా ఉన్నానంటూ బోనీకపూర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest