నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ షో ఇప్పటికే సీజన్ 1 పూర్తి చేసుకొని సీజన్ 2లోకి అడుగు పెట్టింది. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ నారా చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ వారం ఎపిసోడ్‌కి శర్వానంద్, అడివి శేష్ వచ్చారు. ఈ ఎపిసోడ్లో అడివి శేష్‌ని ఉద్దేశిస్తూ.. “నువ్వు నీ సినిమాలో నీ ఫస్ట్ కిస్ ఎవరికి ఇచ్చావ్?” అని బాలకృష్ణ అడిగాడు. ఆదా శర్మ అని శేష్ సమాధానం చెప్పాడు. మరి లాస్ట్ కిస్ అనగానే హిట్ మూవీ 2 మీనాక్షి చౌదరి అని ఠక్కున చెప్పేసాడు.
బాలయ్య అంతటితో ఈ మేటర్ వదిలేయకుండా.. “అడివి శేష్, నువ్వు ఫ్యూచర్లో కిస్ చేయాలనుకుంటున్న హీరోయిన్ ఎవరు? అని అడుగుతాడు. అప్పుడు అడివి శేష్ కాస్త అలోచించి కత్రినా కైఫ్ అని చెప్తాడు. కిస్ చేయకూడదనుకుంటున్న హీరోయిన్ ఎవరు? అని మళ్ళీ ఇంకో క్వశ్చన్ బాలయ్య వేయగానే అలియా భట్ అని శేష్ ఆన్సర్ చేస్తాడు. దాంతో శర్వానంద్ అమాయకంగా అడివి శేష్ వైపు చూసి.. ఏంటి, అలియానా?? అని అనగానే, ఆమెకి మొన్ననేగా పెళ్లి అయిందని శేష్ అంటాడు. మరి కత్రినాకి కాలేదా? అని శర్వానంద్ సటైర్ వేసి ఆటపట్టించాడు.
తర్వాత బాలయ్యని “మీరు మీ మూవీలో ఫస్ట్ లిప్‌లాక్ ఎవరికైనా ఇచ్చారా?” అని శర్వానంద్, అడవి శేష్ అడుగుతారు. అప్పుడు బాలయ్య తన బొబ్బిలి సింహం సినిమా ఓపెనింగ్‌లో జరిగిన ఓ ఆసక్తికర విషయం గురించి అందరితో పంచుకున్నాడు. బాలకృష్ణ మాట్లాడుతూ.. “బొబ్బిలి సింహం సినిమా ఓపెనింగ్ వేమూరు గిట్టపై జరిగింది. అటు పక్కనే రజనీకాంత్, మీనా షూటింగ్ జరుగుతుంది. అక్కడున్న వారంతా మా ఓపెనింగ్‌కి వచ్చారు. రజనీకాంత్ క్లాప్ కొట్టారు. నేను సీరియస్‌గా డైలాగ్ చెప్తున్నాను…”
“తరువాత ఔట్ ఫీల్డ్ నుంచి మీనాని వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టమన్నారు. నేను డైలాగ్ చెప్పడం అయిపోయింది. మీనా రావడం కాస్త లేట్ అయింది. ఏంట్రా ఈవిడ ఇంకా రాలేదు అని నేను అటు పక్కకు తిరిగాను. అప్పటికే మీనా నా బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడానికి రెడీ అయింది. అప్పుడు ఒక్కసారిగా మా లిప్స్ దగ్గరికి వచ్చాయి. వెంటనే మీనా గట్టిగా అరిచింది.” అంటూ బాలయ్య తన సినిమాలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి అన్‌స్టాపబుల్ ప్రేక్షకులతో పంచుకున్నారు.