డ‌బుల్ కాదు, సింగిలే.. `ఎన్‌బీకే 108`పై అనిల్ రావిపూడి నయా అప్డేట్‌!

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. `వీర సింహారెడ్డి` అనే పవర్ ఫుల్ టైటిల్ తో రూపదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా అనంతరం బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుంది. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల ఎంపిక అయింది. అలాగే హీరోయిన్ గా నయనతార నటించబోతోందనే టాక్ ఉంది. అయితే షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించనున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ విషయంపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. సాహో గారపాటి నిర్మాణంలో తాను బాలయ్యతో చేస్తున్న సినిమాలో హీరో క్యారెక్టర్ సింగిలే అని, డబల్ కాదని స్పష్టం చేశారు. అలాగే ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ఫన్ చేయకపోయినా సినిమాలో ఫన్ జనరేట్ అయ్యేలా కథ రాసుకున్నానని అనిల్‌ నయా అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం అవుతుందని కూడా అనిల్ రావిపూడి తెలిపారు.

Share post:

Latest