టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అందం, గురించి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మహేష్ బాబు కుటుంబ వ్యవహారాలలో కూడా ఎంతో మంచి పేరు సంపాదించారు.కేవలం మహేష్ బాబు గొప్పతనం గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. అయితే చాలా మందికి మహేష్ బాబు పై ఎందుకు ఎలాంటి గాసిప్స్, రూమర్స్ రావనే అనుమానం ఉండనే ఉంటుంది.
ముఖ్యంగా మహేష్ బాబుతో ఏ హీరోయిన్ కి లింక్ చేస్తూ వార్తలు కూడా రాయరు. కేవలం మహేష్ బాబు అంటే నమ్రత భర్త అన్నట్లుగా మాత్రమే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మహేష్ బాబు పూర్తిగా నిశ్శబ్దంతో కూడి కేవలం తమ కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తూ అనవసరపు వార్తలను ఎంకరేజ్ చేయకుండా ఉంటారు. మహేష్ బాబు జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు అందులో ఒకరు మహేష్ బాబు అమ్మ ఇందిరా దేవి, మరొకరు ఇందిరా దేవి గారి అమ్మ దుర్గమ్మ గారు. మహేష్ చిన్న వయసు నుంచి ఎక్కువగా తన అమ్మమ్మ దగ్గరే పెరిగారు. అందుచేతనే ఆవిడ చాలా స్ట్రిక్ట్ గా ఉండేదట.
ముఖ్యంగా సినిమాల తాలూకు నీడ కూడా మహేష్ బాబు మీద పడకుండా ఉండాలని దుర్గమ్మ ఎంత ప్రయత్నించినా కానీ అది జరగలేదట.అలాగే వివాహ విషయంలో కూడా నమ్రతను మొదట ఆవిడ రిజెక్ట్ చేశారని వార్తలు వినిపించాయి. ఇక అంతే కాకుండా కృష్ణ రెండో వివాహం చేసుకున్నప్పుడు తన కూతురికి అన్యాయం జరిగిందని ఇందిరా దేవి తల్లి దుర్గమ్మ బాధపడడంతో మహేష్ బాబు ఆ బాధను చూసి.. తన వల్ల ఎవరు కూడా అలా బాధ పెట్టకూడదని నిర్ణయాన్ని తీసుకున్నారు మహేష్ బాబు. అందుకే మహేష్ కేవలం నమ్రతాను మాత్రమే తన జీవితంలోకి ఆహ్వానించారు. ఇక్కడ మహేష్ బాబు తన తల్లికి ఇచ్చిన విలువ అదే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.