సినీ ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మ శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన ఫార్మేట్లో సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాపులతో = తేడా లేకుండా హాట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది . అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు కంప్లీట్ అవుతున్నా ..సరే ఇంకా హీరోయిన్గా అవకాశాలు తెచ్చుకొని యంగ్ బ్యూటీలకు సైతం మైండ్ బ్లాక్ చేస్తుంది. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రత్యేక పాత్రలో అలరించిన శ్రియ.. బాలీవుడ్ లో దృశ్యం 2 సినిమాలో సైతం అందరిని తన నటనతో మంత్రముగ్ధులను చేసింది.
కాగా రీసెంట్గా ఈ సినిమా సక్సెస్ అవడంతో ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ వచ్చింది . ఈ క్రమంలోని శ్రేయ శరణ్ తన సినిమా అప్డేట్స్ తో సహా ఫ్యామిలీ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది . ఈ క్రమంలోనే యాంకర్ నుండి రీసెంట్గా తాను ఎదుర్కొన్న ట్రోలింగ్ ప్రశ్న ఎదురైంది . ఈ క్రమంలోని శ్రేయర మాట్లాడుతూ..” నా భర్త చాలా సరదాగల మనిషి.. ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ.. మనసులో ఏం పెట్టుకోరు.. ఒకరు ఒక మాట అన్నా లైట్ గా తీసుకుంటారు . అది నాకు చాలా నచ్చింది. అంతే కాదు ఒక మనిషి మంచి పని చేసిన లేదా ఏదైనా సాధించిన అప్రిషియేట్ చేయడం సర్వసాధారణం .మరీ ముఖ్యంగా మనకి ఇష్టమైన వాళ్లను అలాంటి పనులు చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఆనందిస్తాం ..అలాంటి టైం లో వాళ్ళని హగ్ చేసుకోవడం ..ముద్దు పెట్టుకోవడం చేస్తూ ఉంటాం”.
” నా భర్తకు ఎక్కువగా పెదాలపై ముద్దు పెట్టే అలవాటు ఉంది . మా కల్చర్ లో ఇది పెద్ద తప్పు కాదు . అయితే రీసెంట్గా ఓ సినిమా ప్రమోషన్స్ లో నా భర్త లిప్ లాక్ చేయడంపై చాలామంది జనాలు ట్రోల్ చేశారు . అది ఎందుకో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు . నా భర్త నన్ను ముద్దు పెట్టుకుంటే తప్పేమిటి..? అంతేకాదు మీరు ఎన్నిసార్లు ట్రోల్ చేసినా నా భర్త అలాంటివి పట్టించుకోడు . మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం..ఉంటాం. నా భర్తకి నేనంటే చాలా ఇష్టం. మరి ముఖ్యంగా నేను సినిమాలో నటించడం ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నేను నో వద్దు అని చెప్పిన సరే నా మాట వినడు ..తనకి నన్ను ముద్దు పెట్టుకోవడం అంటే ఇష్టం” అంటూ హాట్ కామెంట్స్ చేసింది.