గత ఏడాది `పుష్ప` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం `పుష్ప 2` తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజాగా సెట్స్ మీదకు వెళ్ళింది. ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తుంటే.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకునే ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటికే జల్సా, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి చిత్రాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మంచి విజయాలు అందుకున్నాయి.
అయితే ఇప్పుడు ఈ హిట్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోందట. తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో నాలుగో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడట. త్రివిక్రమ్ సైతం బన్నీ కోసం ఓ అదిరిపోయే కథను రెడీ చేశడట. త్వరలోనే బన్నీని కలిసి త్రివిక్రమ్ కథను నెరేట్ చేయనున్నారట. కథ నచ్చితే పుష్ప 2 పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.