నటి దివి అందరికీ తెలిసే ఉంటుంది. దివి అనే ఓ హీరోయిన్ ఉందని తెలుగు జనాలకి బిగ్ బాస్ షో ద్వారానే తెలిసింది. సీజన్ 4లో దివికి అవకాశం రావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. దివి గ్లామర్ బిగ్ బాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ షోలో అందరిలాగా ఆమె అఫైర్స్, స్కిన్ షోకి దూరంగా ఉన్నారు. అలాగే గేమ్ కూడా అంత అగ్రెసివ్ గా ఆడేది కాదు. ఆ సమయంలో ఎక్కువగా అమ్మ రాజశేఖర్ తో స్నేహం చేసింది. ఆ కారణంగా దివి కనీసం ఫైనల్ కి కూడా చేరుకోలేదనేది ఓ వాదన. ఆ సీజన్ లో అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అఖిల్ రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసినదే కదా.
ఆ సంగతి అప్రస్తుతం కానీ, ఆ షోలో అరియానా, సోహైల్, అలేఖ్య ఫైనల్ కి చేరి ఒకింత ఫేమస్ అయ్యారు కానీ దివి విషయంలో అలా జరగలేదు. కానీ ఆ తరువాత దివికి ఫేమ్ దక్కింది. బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు ఊహించని విధంగా సినిమా అవకాశాలు దక్కాయి. గతంతో పోల్చితే ఆమెకు లీడ్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం లంబసింగి టైటిల్ తో ఓ మూవీలో ఆమె నటిస్తున్నారు. ఒక ప్రక్కన అంది వచ్చిన అవకాశాలు కాదనకుండా చేస్తూనే సోషల్ మీడియా వేదికగా గ్లామర్ విందు చేస్తుంది ఈ అమ్మడు.
అవును, దివి విరహ వేదనతో అల్లాడుతున్నట్టు కనబడుతోంది. ప్రియుడి చూపుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న దానిలా.. ఓ రొమాంటిక్ ఫోటో షేర్ చేసి, దివి పోస్ట్ చేసిన కామెంట్ పలు అనుమానాలకు దారి తీస్తోంది. అవును, ఆమె చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఇపుడు తెగ వైరల్ అవుతుంది. క్లోజప్ షాట్ లో కళ్ళు హైలెట్ అయ్యేలా ఫోటో షేర్ చేసింది. ఆ ఫొటోలోని దివి కళ్ళను చూస్తుంటే ఎవరి కోసమో వెతుకుతున్నట్టు కనబడుతోంది. ”నా కళ్ళల్లో నిన్ను చూడాలనివుంది” అని ఆమె షేర్ చేసిన వాక్యం ఇపుడు పలు అనుమానాలకు దారి తీస్తోంది.