వరుణ్ తేజ్ అలాంటి సెంటిమెంట్స్ ఫాలో అవుతాడా? గుట్టురట్టుచేసిన దర్శకుడు!

వరుణ్ తేజ్.. పరిచయం అక్కర్లేని 6 అడుగుల టాలీవుడ్ ఫిగర్. మెగా ఫ్యామిలీనుండి వచ్చినా, మొదటి నుండి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని వరుణ్ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెట్లు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. చాలా మంది దర్శకులకు, హీరోలకు చాలా రకాల సెంటిమెంట్లు అనేవి ఉంటాయి. అలాగే మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కూడా ఓ బలమైన సెంటిమెంట్ ఉందని తాజాగా తెలిసినది. అదేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే!
by
అలనాటి సీనియర్ నటుడు NTR టైమ్ నుంచే ఈ సెంటిమెంట్ అనేది నడుస్తోంది. ఉదాహరణకు నందమూరి బాలయ్యకి ఇద్దరు హీరోయిన్లు సెంటిమెంట్, సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమాకి మూడు అక్షరాలు అనేది ఓ సెంటిమెంట్. అలాగే విక్టరీ వెంకటేష్ కి చాలా సంవత్సరాలు సినిమా టైటిల్ చివరిలో ‘రా’ అనేది ఒక సెంటిమెంట్ గా ఉండేది. ఇక ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి అప్పట్లో సినిమా టైటిల్ ‘అ’తో మొదలవ్వాలనే సెంటిమెంట్ ఉండేది. ఆహుతి, ఆవేశం, అంకుశం, అంజి, అరుంధతి సినిమాలు అలా వచ్చినవే.

అలాగే చాలా మందికి కొన్ని థియేటర్స్ లో సినిమా చూడటం అనేది అనాదిగా సెంటిమెంట్ గా వస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తన ప్రతి సినిమాని కూకట్ పల్లిలో వున్న ‘భ్రమరాంబ’లోనే చూస్తాడు. అలానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కూడా ఓ విచిత్రమైన సెంటిమెంట్ ఉందట. తన సినిమాలో ఖచ్చితంగా ఓ సీన్ కాని రొమాంటిక్ సాంగ్ కాని.. లండన్ కి వెళ్లి షూట్ చేస్తే, ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని ఆయనకి ఓ నమ్మకమట. అది ప్రాక్టికల్ గా నిరూపితం కూడా అయ్యిందట. ఇది చాలా విచిత్రమైన సెంటిమెంట్ కదూ.