బాలయ్య మజాకా… యూట్యూబ్ ని షేక్ చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోమో..!

నందమూరి బాలకృష్ణ తొలిసారిగా వ్యాఖ్యాతిగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ సీజన్ 1 ఎవరు ఊహించని రీతిలో భారీ సక్సెస్ అయింది. ఈ షో అన్ని టాక్ షోలకన్నా నెంబర్ 1 టాక్ షో అని ఐ ఎమ్ డి బి రేటింగ్ కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ కి సంబంధించిన ట్రైలర్- ప్రోమోలతో భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ లగా రాబోతున్న చంద్రబాబు- లోకేష్ తో బాలయ్య చేసిన ఇంటర్వ్యూ కు సంబంధించిన ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేశారు. మొదటి ఎపిసోడ్ ప్రోమో వీడియో ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.

Unstoppable 2 Promo Record Views: బావను కాంట్రవర్సీ, క్రేజీ ప్రశ్నలతో  ఉక్కిరిబిక్కరి చేసిన బాలయ్య.. అన్ స్టాపబుల్ 2 ప్రోమోకి రికార్డు వ్యూస్! -  OK Telugu

ఈ ప్రోమో యూట్యూబ్ లోనే నెంబర్1 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. గెస్ట్ లగా వచ్చిన చంద్రబాబుతో బాలయ్య చేసిన రచ్చ అంతా కాదు. ఇందులో బాలయ్య- చంద్రబాబును రాజకీయాలు సినిమాలు అల్లరి.. తన కాలేజ్ డేస్ సంబంధించిన అన్ని విషయాలను అడిగాడు.. వీరితోపాటు బాల‌య్య మధ్యలో లోకేష్ తో చేసిన కామెడీ అదుర్స్ అనే చెప్పాలి. చంద్రబాబు- బాలకృష్ణ మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో ఈ ప్రోమో చూస్తుంటే మనకు తెలుస్తుంది. మొదటి ప్రోమోతోనే ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. మొత్తం ఎపిసోడ్ ఈనెల 14న ఆహాలో స్ట్రీమింగ్ అవనుంది. మరి ఈ షోలో బాలకృష్ణ-చంద్రబాబుల మధ్య వచ్చే పంచులు చూడాలంటే మొత్తం ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.