ఒక్క సినిమా హిట్ కొట్టి.. కొన్ని సంవత్సరాలు హిట్లు లేక బాధపడుతున్న స్టార్స్ వీళ్లే..!!

ఎ హీరో అయిన‌ తన కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ సినిమా తీయాలంటే ఎంతో కష్టపడాలి సినిమా కథ కాస్టింగ్ బడ్జెట్ సంగీతం అన్ని సెట్ అయితేనే ఆ సినిమా ఎంతో సూపర్ హిట్ అవుతుంది.. కొన్నిసార్లు ఇలాంటి సూపర్ హిట్‌ దక్కించుకోవడం కూడా ఆ స్టార్ హీరోలకు ప్రమాదమే.. ఇలాంటి సూపర్ హిట్ వచ్చిన తర్వాత వాళ్ళా తర్వాతి సినిమాలపై కూడా హిట్ అయిన సినిమాల‌ ప్రభావం ఉంటుంది. దీంతో ప్రేక్షకులు ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తారు. ఒక స్టార్ హీరో ఇండస్ట్రీ హిట్ కొడితే అభిమానులు ప్రేక్షకుల అభిరుచులు మారిపోతాయి.. హీరోని ఆకాశానికి ఎత్తేస్తారు. వాళ్ళా తర్వాత సినిమాల గురించి కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటారు. అభిమానులు పెట్టుకున ఎక్స్పేక్టేషన్స్ కు ఆ సినిమా రిచ్ అవ్వ‌కపోతే ఆ సినిమాని ప్లాప్‌ సినిమాగా మార్చేస్తారు. ఈ క్రమంలోనే ఒక సినిమా హిట్ అయిన వెంటనే తర్వాత సినిమాలతో ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా స్టార్స్‌ ఎవరు ఇప్పుడు చూద్దాం.

 Tollywood Stars Who Have No Hit Afer Black Buster , Tollywood Stars,krishna ,pra-TeluguStop.com

సూపర్ స్టార్ కృష్ణ:

సూపర్ స్టార్ కృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాలలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలలో అల్లూరి సీతారామరాజు సినిమా ఒక ప్రభంజనం. ఈ సినిమాతో కృష్ణ తెలుగు నాట ఒక ప్రభంజనం సృష్టించాడు. ఈ సినిమా విడుదలై కొన్ని సంవత్సరాలు అవుతున్న కృష్ణ నటన మనం మర్చిపోలేక పోతున్నాం. సీతారామ‌రాజు పేరు గుర్తుకు వచ్చిన వెంటనే మనకి కచ్చితంగా కృష్ణ గుర్తుకొస్తారు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక.. ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ కృష్ణకు ప్లాప్‌ సినిమాలుగాా మిగిలిపోయాయి. ఈ సినిమా తర్వాత మళ్లీ హిట్ కొట్టడానికి కృష్ణకు 8 సంవత్సరాల సమయం పట్టింది.

Telugu Baahubali, Bahubali, Keerthy Suresh, Krishna, Mahanati, Prabahas, Rajamou

ప్రభాస్:

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఆ సినిమాలతో తన క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమాల తర్వాత నుంచి ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. బాహుబలి సినిమాలు తర్వాత ప్రభాస్ హిట్ కొట్టలేకపోయాడు. రానున్న సినిమాల భవిష్యత్తు ఏంటో ప్రశ్నార్థకంగా మారింది.

Telugu Baahubali, Bahubali, Keerthy Suresh, Krishna, Mahanati, Prabahas, Rajamou

రానా:

బాహుబలి సినిమాలలో బళ్లాలదేవ క్యారెక్టర్ లో తనలోని విలన్ ను పాన్ ఇండియా వైడ్ గా చూపించి ఎంతో పాపులర్ అయ్యాడు రానా. ఈ సినిమాలు తర్వాత రానా కొన్ని సినిమాల్లో సోలో హీరోగా నటించాడు. అయ‌న నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఆయన బాహుబలి సినిమాలు తర్వాత చేసిన సినిమాలలో నేనే రాజు నేనే మంత్రి సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ ఆయనకు భారీ డిజాస్టర్ సినిమాలు గా మిగిలిపోయాయి. అ సినిమాల తర్వాత నుంచి ఇప్పటివరకు రానాకి చెప్పుకోదగ్గ హిట్ లేదు.

Telugu Baahubali, Bahubali, Keerthy Suresh, Krishna, Mahanati, Prabahas, Rajamou

కీర్తి సురేష్:
మహానటి సినిమాతో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమాతో కీర్తి సురేష్ కు జాతీయస్థాయిలో అవార్డులు కూడాా వచ్చాయి. సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేసిన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ హిట్ కొట్టడానికి దాదాపు నాలుగు సంవత్సరాల టైం పట్టింది. రీసేంట్‌ గా వ‌చ్చిన‌ సర్కారీ వారి పాట సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాకు ముందు కీర్తి సురేష్ దాదాపు తొమ్మిది సినిమాల్లో నటించింది. ఆ సినిమాలో ఏ ఒక సినిమా హిట్ అవ్వలేకపోయింది.