unstoppable2: నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే..ఓపెన్ గా చెప్పేసిన చంద్రబాబు..!!

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు బాలకృష్ణ బావగారు అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో ఒక్కసారిగా సినీ రంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా బాలయ్య షో పై కాన్సన్ట్రేషన్ చేశారు . చంద్రబాబు నాయుడు ఈ షోలో ఎలాంటి మాటలు మాట్లాడారా..? రాజకీయాల గురించి ఎలాంటి కామెంట్స్ చేశారో.. అన్నది హాట్ టాపిక్ గా మారింది.

కాగా ప్రజెంట్ ఆహా ఓటీడీలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు ని ఇన్వైట్ చేయడం షోకే హైలెట్గా మారింది. షోలో భాగంగా బాలయ్య , బావ గారు చంద్రబాబు నాయుడును కొన్ని ప్రశ్నలు అడిగారు. బిగ్ డే, బిగ్ అలయన్స్, బిగ్ మిస్టేక్ , బిగ్ ఫియర్, బిగ్ డెసిషన్.. అన్న పదాలకు చంద్రబాబు నాయుడు తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు . మరీ ముఖ్యంగా బిగ్ మిస్టేక్ అన్న పదానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన క్లారిటీ అందరిని ఆకట్టుకుంది.

ఆయన మాట్లాడుతూ ..”2003లో నాపై అలిపిరిలో అటాక్ జరిగింది. ఆ సమయంలో నేను అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలనుకున్నాను. ఆ నిర్ణయం పరోక్షకంగా పక్క రాష్ట్రాలపై కూడా పడింది. అదే టైంలో దేశంలో వాచ్ పేయి గారు నన్ను చూసి ఇండియా ఈజ్ షైనింగ్గ్ అనే నినాదంతో పార్లమెంట్ ని రద్దు చేసిఎన్నికలకు వెళ్లారు. అదే టైం లో ఒడిస్సాలో నవీన్ పాట్నాయక్.. కర్ణాటక ఎస్ఎం కృష్ణ కూడా అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లారు. అయితే అలా చేసిన నలుగురిలో ముగ్గురు ఓడిపోయి ఒక్కరు మాత్రమే గెలిచారు. మనం తీసుకున్న నిర్ణయాలు మన మీద నమ్మకంతో వేరే వాళ్లపై కూడా ప్రభావం చూపిస్తాయి. ఆ రోజు నేను కానీ ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఆరోజు ముగ్గురు ఓడిపోయేవారు కాదు. నా జీవితంలో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటూ ఉంటే అదే . అలా ఆరోజు అసెంబ్లీని రద్దు చేయకుండా ఉంటే చరిత్ర మరో విధంగా ఉండేదేమోనని..” చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీంతో చంద్రబాబు నాయుడు కామెంట్స్ వైరల్ గా మారాయి.