ఆ స్టార్ హీరో చెప్పాడు.. త‌మ‌న్నా వెంటప‌డుతోన్న క్రేజీ డైరెక్టర్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సినిమా అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయింది. బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలలు లేకుండా రిలీజ్ అయిన పుష్ప ఏకంగా రు. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓవ‌రాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రు. 350 కోట్లు కొల్లగొట్టడంతో బన్నీ స్టామినా ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాలో సమంత చేసిన.. ఉ అంటావా మామ ఉ ఊ అంటావా మామ ఐటెం సాంగ్ ప్రేక్షకులను ఎంతలా ఊపేసిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా విజయంలో ఈ ఐటెం సాంగ్ కి రోల్ పోషించింది. ఈ ఐటెం సాంగ్ అటు సమంతకు కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ఊపు ఇచ్చింది. ఇప్పుడు పుష్పకు సీక్వెల్ గా పార్ట్ 2 తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైంది.

ఈ సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఐటెం సాంగ్ లో ముందుగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేరు పరిశీలించారు రీసెంట్గా ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వడంతో కాజల్ పేరుకు బదులుగా బాలీవుడ్ ఆంటీ మలైక ఆరోరా పేరు పరిశీలించారు. మలైక‌ వయసులో ఉండగా ఐటెం సాంగ్ లకు పెట్టింది పేరు మలైక ఐటెం సాంగ్ చేసిందంటే అప్పట్లో బాలీవుడ్ అంతా ఊగిపోయేది.

అయితే ఇప్పుడుమలైకకు బదులుగా మిల్కీ బ్యూటీ తమన్నాను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. తమన్నా ఐటెం సాంగ్ చేసింది.. అంటే అదిరిపోవాల్సిందే గతంలో ఆమె బన్నీకి జోడిగా బద్రీనాథ్ సినిమాలో నటించింది. ఇప్పుడు పుష్ప 2 కోసం బన్నీయే స్వయంగా తమన్నాను రెకమెండ్ చేయడంతో సుకుమార్ ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది.