జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు గత కొంతకాలంగా ఎన్టీఆర్ షూటింగ్లకు దూరంగా ఉన్న తనని అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్ నటులలో ఒకరైన మహేష్ విట్టా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మహేష్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మహేష్ విట్టా మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమానిని ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని మాక్సిన్ అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటానని తెలియజేశారు. తారక్ గురించి ఎవరేం చెప్పినా తాను వింటూనే ఉంటానని తెలిపారు. షూటింగ్ సమయాలలో రాత్రివేళలో కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఉదయం కరెక్ట్ గా షూటింగ్ సమయానికి వస్తారని తెలుపుకొచ్చారు. తనకి ఆకలి వేస్తే ఎలాంటి ఆహారాన్ని అయినా తింటారని వెల్లడించారు క్యారెక్టర్ కోసం మారాలి అంటే ఎంత కష్టమైనా సరే అందులోకి మారిపోతూ ఉంటారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్కు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని తెలియజేశారు.
ఎన్టీఆర్ కొంతకాలం ఓల్డ్ సిటీలో ఉన్నారని ఓల్డ్ సిటీ ఉర్దూ స్లాంగ్ బాగ తారక్ బాగా మాట్లాడుతారని తెలియజేశారు. ఇలాంటి టాలెంట్ ఏ హీరోలో లేదని మహేష్ విట్ట తెలియజేశారు. అలాంటి పాత్ర ఎన్టీఆర్ కు వచ్చిందంటే బాగా మెప్పిస్తారని తెలియజేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ చేసిన ఈ కామెంట్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక మహేష్ విట్టా తన పక్కన ఎప్పుడు జనాలు ఉండాలని కోరుకుంటానని నాకు నీట్నెస్ అంటే చాలా ఎక్కువ అని తెలిపారు నేను ఫ్యామిలీ నుంచి వచ్చానని కానీ తన జీవితంలో ఏం జరిగినా అమ్మకు చెబుతానని తెలియజేశారు.