సాయి పల్లవి మనసులో అల్లు అర్జున్ స్థానం ఇదే?

హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె చాలా భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాల ఎంపిక కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఏదో మూసధోరణి విధానంలో కాకుండా చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ పోతుంది. అందుకే ఆమెకి అంత మంచి పేరు. ఇక ఆమెని ఇష్టపడని తెలుగు యువత దాదాపు ఉండరనే చెప్పుకోవాలి. ఒక సినిమా ఆఫర్ ని తనకి నచ్చితేనే చేస్తుంది, లేదంటే లేదు. ముఖ్యంగా పాత్ర ప్రాధాన్యం బట్టి ఆమె సినిమా ఆఫర్ ని ఒప్పుకుంటుంది.

అందుకే నేడు సాయి పల్లవి తెలుగు చిత్రసీమలో ఈ స్థాయిలో వుంది. మహేష్ సినిమా కోసం ఒకసారి అనిల్ రావిపూడి స్వయంగా వెళ్ళి అడిగినా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను రిజెక్ట్ చేసిందని వినికిడి. అలాగే ఓ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… “ఒక సినిమాలో హీరోయిన్ పాత్రని కావాలని ఇరికించినట్టు ఉండకూడదు. హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలి” అని చెప్పుకొచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ “నేను స్టార్ హీరోతోనే సినిమా చేయాలి అని అనుకోను.. నా దృష్టిలో ఓ కధే హీరో.. కథ నచ్చితే ఎవరితో అయినా చేస్తాను” అని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా ఆమె ప్రముఖ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ… “అల్లు అర్జున్ డాన్స్ లో ఏదో తెలయని మాయ వుంది. అందుకే ఆయన డాన్స్ చేస్తుంటే అలానే చూడాలి అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చింది. బేసిగ్గా సాయి పల్లవి డాన్సర్ కావడంతో బన్నీని అమితంగా ఇష్టపడుతోంది. ఇక చాన్సు వస్తే బన్నీతో కలిసి నర్తించడానికి కూడా సిద్ధంగా వున్నానని చెప్పుకొచ్చింది. అలాగే మహేష్ బాబు స్క్రీన్ ప్రజెంట్ చాలా నచ్చుతుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మహేష్ బాబును చూశాక మగాళ్లు ఇంత అందంగా ఉంటారా? అని అమ్మడు ఆశ్చర్యపోయిందట.