అత‌డు `గే` అని తెలిస్తే ఆ ప‌నే చేస్తాను.. ర‌కుల్ షాకింగ్ కామెంట్స్ వైర‌ల్!

రకుల్ ప్రీత్ సింగ్.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి స్టార్ డంను దక్కించుకుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్న రకుల్ ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోను వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా దూసుకుపోతుంది.
తాజాగా ఆమె బాలీవుడ్ లో `డాక్టర్ జీ` అని సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం సామాజిక మధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే 2011లో మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ కు.. జడ్జ్ ల నుండి `ఒకవేళ నీ కొడుకు గే అని తెలిస్తే మీరు ఏం చేస్తారు? అనే ప్రశ్న ఎదురయింది.

ఆ ప్రశ్నకు రకుల్ సమాధానమిస్తూ.. ఆ విషయం తెలియగానే ఫస్ట్ నేను షాక్ అవుతాను. ఆ తరువాత వెంటనే అతన్ని చంప దెబ్బ కొడతాను, కానీ తరువాత మెల్లగా ఆలోచిస్తాను. సరే అతని నిర్ణయాన్ని నేను గౌరవించి.. అదే దారిలో తాను వెళ్లాలనుకుంటే నాకు ఎలాంటి సమస్య లేదు అంటూ సమాధానమిచ్చింది. అంతేకాకుండా రకుల్ తనకు సంబంధించినంతవరకు తాను చాలా ముక్కు సూటిగా ఉండేందుకు ఇష్టపడతానని పేర్కొంది. ప్రస్తుతం రకుల్ చెప్పిన షాకింగ్ కామెంట్లు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.