ప్రభాస్ సలార్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరో గా వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. జగపతిబాబు, పృధ్విరాజ్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈరోజు పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయనకు సంబంధించిన మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.

Official: Prithviraj Sukumaran in Prabhas' Salaar | 123telugu.com

ఇందులో పృథ్వీరాజ్ క్యారెక్టర్ పేరు వరదరాజు మన్నారర్‌ అనే పాత్రలో ఆయన నటిస్తున్నాడు. ఆ లుక్ లో ఆయనను చూస్తుంటే సలార్‌లో పృథ్విరాజ్ భారీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని అర్థమవుతుంది. ఆయన ఫేస్ నిండా మసి పూసి , ముక్కికి ముక్కుపుడక మెడలో వెండి కడియాలు ఉన్నాయి. జ‌గ‌ప‌తిబాబు కూడా ఇందులో మరో విలన్ గాా ఉన్న.. ఈ సినిమాలో మెయిన్ విలన్ పృధ్విరాజ్ అని తెలుస్తుంది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రేక్షకులు ముందుకు రానుంది.