జపాన్ మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్.. ఎందుకంటే..?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా కూడా RRR సినిమాతో మంచి పేరు సంపాదించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ముఖ్యంగా జపాన్ లో కూడా ఎన్టీఆర్ ని అభిమానించే వారి సంఖ్య ప్రస్తుతం మరింత ఎక్కువైందని చెప్పవచ్చు. అయితే రజనీకాంత్ తర్వాత జపాన్ లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా జనతా గ్యారేజ్ సినిమా విడుదల సమయంలో జపాన్ నుంచి ఒక అభిమాని ఇండియాకి వచ్చి ఎన్టీఆర్ తో ఫోటో దిగి వెళ్లడం కూడా జరిగింది అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారింది.

Jr NTR About Politics: A Message For Own Fans

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటనకు డాన్స్ కి జపాన్ ప్రేక్షకులు సైతం విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాలు జపాన్ లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందాయి ముఖ్యంగా బాద్ షా చిత్రం అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా కూడా అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర పేను సంచలన విజయాన్ని అందుకోని ప్రశంసలు కూడా అందుతుంది.

తాజాగా ఎన్టీఆర్ జపాన్ మీడియాతో ఆన్లైన్ వేదికగా ముచ్చటించడం జరిగింది. ఇక ఇందులో RRR సినిమాకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వారితో పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ తెలియజేశారు. ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి జపనీస్ మీడియాతో RRR అనుభవాన్ని తిరిగి పొందుతున్నానని అందరి ప్రేమ మరియు ప్రశంసలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అని ఎన్టీఆర్ తన ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రిప్ వైరల్ గా మారుతోంది.

https://twitter.com/tarak9999/status/1577269443616350210?s=20&t=5bPxASZjHh7OzFoAlQJ4FQ