వావ్: ఆన్ స్టాపబుల్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది..!!

నందమూరి బాలకృష్ణ గత ఏడాది వచ్చిన అఖండ సినిమాతో భారీ సక్సెస్ను తన ఖాతాలో వేసుకుని వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమ‌ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంలోనే 2022 ప్రథమంలో ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో ప్రేక్షకులను ఎంతో బాగా అలరించారు.

Unstoppable With NBK Season 2 Release Date, OTT, Teaser & More Details Here  - JanBharat Times

ఈ షోలో బాలకృష్ణ యాంకరింగ్ కి మేనేరిజం, బిహేవియర్ కి ఈ షో తో యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. బాలయ్య షో తో ఆహా ఓటీటీ మరో లెవల్ కి వెళ్లిందని చెప్పవచ్చు. బాలయ్య చేసిన ఈ షోకి ఇండియాలో వచ్చిన టాక్ షోలోనే నెంబర్ వన్ స్థానంలో లో నిలిచింది. దీన్నిబట్టి బాలయ్య ఏ రేంజ్ లో అలరించాడో మనం చెప్పవచ్చు.

మరి ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 అతి త్వరలో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే సీజన్ 2 కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. మరొక మూడు రోజుల్లో అనగా అక్టోబర్ 4న ఈ సీజన్‌కు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సీజన్లో బాలకృష్ణను మునిపెన్నడూ ఎవరు చూడని విధంగా డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నారని సీజన్ కు సంబంధించిన ఇంట్రెస్ట్ పిక్ ద్వారా వెల్లడించారు. ఈ వార్తతో ఈ సీజన్ ట్రైలర్ పై అందరిలో ఆసక్తి రేకెత్తించారు. అలానే అదే రోజున ఈ సీజన్ స్ట్రీమింగ్ అయ్యే డేటును కూడా వారు అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తుంది.

Share post:

Latest