నాభి అందాలతో చెమ‌ట‌లు పట్టించిన‌ న‌భా న‌టేష్..వైర‌ల్‌గా లేటెస్ట్ పిక్స్‌!

నభా నటేష్.. `నన్ను దోచుకుందువటే` అనే సినిమాలో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాలో రామ్ పోతినేని జంట‌గా నటించి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి.

రవితేజ తో `డిస్కో రాజా` సినిమా అలాగే సాయిధరమ్ తేజ్ తో `సోలో బ్రతుకే సో బెటర్` వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ బ్యూటీ తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తన అందం, అభినయంతో యూత్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నభా సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫోటోలతో అందాలు ఆరబోస్తూ అరాచకాన్ని సృష్టిస్తుంది.

తాజాగా నాభి అందాలతో చెమటలు పట్టిస్తూ నభా దీపావళి పండుగని ముందే తెచ్చింది. అందులో లెహంగా చోళీ లో కనువిందు చేస్తూ నాభి చూపిస్తూ కుర్ర కారుని మెస్మరైజ్ చేస్తుంది. అంతేకాకుండా ఒకవైపు లూస్ బ్లౌస్ లో క్లీవేజ్ అందాలను చూపిస్తూ.. మరోవైపు చేతులు పైకెత్తి నాభి అందాలను చూపిస్తూ అభిమానులకు అందాల ట్రీట్ ఇస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం నాభా నటేష్ తన లేటెస్ట్ ఘాటు పిక్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.