ఆంటీ మ‌లైకా అరోరా ఎఫైర్లు పెట్టుకున్న హీరోలు వీళ్లే… చాలా క‌థ‌లు న‌డిపిందే…!

బాలీవుడ్ హాట్ ఆంటీ మలైకా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్ తో 18 ఏళ్ల వైవాహిక జీవితానికి సింపుల్గా ముగింపు చెప్పేసింది. తనకంటే వయసులో 13 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఎం చ‌క్క‌గా చట్టపట్టలేసుకుని సహజీవనం చేస్తోంది. రీసెంట్గా మ‌లైకా- అర్బాజ్ పెళ్ళికి వచ్చిన అర్జున్ కపూర్ కూల్ డ్రింక్ తాగుతున్న ఫోటో కూడా వైరల్ అయింది. మ‌లైకా పెళ్ళికి వెళ్ళినప్పుడు అర్జున్ కపూర్ చాలా చిన్నోడు. తాను పెళ్లికి వెళ్లిన ఆంటీతోనే తాను ఎఫైర్ పెట్టుకుంటానని అర్జున్ కలలో కూడా ఊహించి ఉండడు.

1998 డిసెంబర్లో మలైకా, అర్బాజ్ పెళ్లి చేసుకున్నారు. 19 సంవత్సరాల తర్వాత 2017లో వీరు తమ పెళ్లి బంధానికి స్వస్తి పలికారు.. విడాకులు తర్వాత మలైకా- అర్జున్ కపూర్ తోను అర్బాజ్- జార్జియా ఆండ్రియా తోను రిలేషన్ లో ఉన్నారు. మ‌లైకా – అర్బాజ్ దంపతులకు 19 ఏళ్ల కుమారుడు అర్హన్ ఖాన్ కూడా ఉన్నాడు. అయితే కుమారుడి బాధ్యత నెరవేర్చే విషయంలో మ‌లైకా – అర్బాజ్ కలిసికట్టుగానే ఉంటున్నారు.

రీసెంట్‌గా ఇంటర్వ్యూలో మ‌లైకా మాట్లాడుతూ.. తను ఇప్పటికీ తన మాజీ భర్తతో టచ్ లో ఉన్నానని.. అర్బాజ్ చాలా మంచి వ్యక్తి… అతడు బాగుండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని తెలిపింది. ఇద్ద‌రు వ్య‌క్తులు చాలా మంచి వాళ్లే అయినా కలిసి బతికే విషయాల్లో ఆ రకంగా ఉండకపోవచ్చు అని… తమ దాంపత్య జీవితంలోను అదే జరిగిందని వెల్లడించింది.

ఇక తన కుమారుడితో తనకి మంచి అనుబంధమే ఉందని చెప్పింది. అర్బాజ్ తో పెళ్లికి ముందే ఒకటి రెండు ఎఫైర్లు పెట్టుకున్న మలైకా.. ఆ తర్వాత మరో బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ తో కూడా కొంతకాలం క‌థ‌ నడిపిందన్న గాసిప్పులు అయితే ఉన్నాయి.