నందమూరి మోక్షజ్ఞ జాతకం చెప్పేసిన జ్యోతిష్యుడు… స్టార్ హీరో అయ్యే యోగం లేదా?

నందమూరి అభిమానులు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ విషయం ఎన్నో సంవత్సరాలనుండి సాగుతుంది గాని, ముందుకు కదలడంలేదు. ఆయన ఫస్ట్ మూవీ గురించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్స్ లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం శ్రమిస్తున్నారని, బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్ గురించి ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పక్కాగా ప్లాన్స్ చేస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి.

ఈ తరుణంలో ప్రముఖ సినిమా జ్యోతిష్యుడు అని పేరు మోసిన వేణు స్వామి తాజాగా ఓ మీడియా వేదికగా మోక్షజ్ఞ సినిమా కెరీర్ గురించి మాట్లాడాడు. కాగా ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవును, ఎంతోమంది సెలబ్రిటీల జ్యోతిష్యం చెబుతూ తరచుగా వార్తల్లో ఉంటున్న వేణు స్వామి.. తాజాగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినిమా భవిష్యత్ గురించి చిలకజోష్యం చెప్పారు. అందరూ అనుకున్నట్లుగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అంత త్వరగా ఉండదని, కాస్త లేటుగానే ఉంటుందని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ… టాలీవుడ్ లో మోక్ష తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగే అవకాశం ఉందని అన్నారు. కాగా ఈ విషయం విన్న నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే మోక్షజ్ఞకు సినిమా భవిష్యత్తు తప్ప రాజకీయ భవిష్యత్ ఉండదని వేణు స్వామి అన్నారు. అసలు రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ కూడా ఇవ్వడని చెప్పారు. సినిమాలే మోక్షజ్ఞ జీవితాన్ని నిర్దేశిస్తాయని అన్నారు. ఇకపోతే వేణు స్వామి అన్నట్టే మోక్ష ఎంట్రీ మాత్రం ఇప్పట్లో లేదని అర్ధం అవుతోంది.