నాలో ఆ రెండు నాకు నచ్చవు.. కానీ జనాలకి ఇష్టం..కీర్తి తలతిక్క కామెంట్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీస్ తమలోని లోపాలను పబ్లిక్ గా చెప్పుకొస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా మాలో మైనస్ ఇదే అంటూ ఓపెన్ గా చెప్పుకోరావడం సినీ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది . అయితే రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయింది అందాల భామ కీర్తి సురేష్. మనకు తెలిసిందే కీర్తి సురేష్ మహానటి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ నటిగా గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాదు ఈ సినిమాకు గాను కీర్తి సురేష్ నేషనల్ అవార్డు అందుకొని చరిత్ర సృష్టించింది .సినీ ఇండస్ట్రీలోకి వచ్చి పది పదిహేను సంవత్సరాలు అవుతున్న నేషనల్ అవార్డు కొట్టలేని హీరోయిన్స్ ముందు కేవలం సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే నేషనల్ అవార్డు సంపాదించుకుని సినీ ఇండస్ట్రీలో సంచలన రికార్డు నెలకొల్పిన ఘనత కీర్తి సురేష్ కే దక్కింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో “సర్కారి వారి పాట” అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కీర్తి సురేష్.. ప్రజెంట్ మూడు సినిమాల్లో బిజీగా ఉంది. అయితే రీసెంట్గా మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న కీర్తి సురేష్ తనకు సంబంధించిన నెగటివ్ పాయింట్స్ చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది . అయితే కీర్తి సురేష్ లో తనకు నచ్చని పాయింట్స్ అభిమానులకు నచ్చాయి అంటూ చెప్పి బిగ్ బాంబ్ పేల్చింది.

మీడియాతో మాట్లాడుతూ కీర్తి సురేష్..” నాలో నా నటన అందరికీ ఇష్టం అంటారు .కానీ నా నటన స్టైల్ నాకు నచ్చదు . ఎందుకో తెలియదు కానీ మహానటి సినిమా ద్వారా అందరు నన్ను ఇంకో సావిత్రి అంటున్నారు. కానీ ఆమె పేరుకు నేను సరిపోను. ఆమె ఎంత గొప్ప నటి అనేది నాకు మా అమ్మగారు చెప్పారు. అయితే నన్ను మహానటి అంటూ సావిత్రి గారితో పోల్చడం నిజంగా నాకు నచ్చదు. కానీ నేను ఈ మాట ఎంతమందికి చెప్పిన అందరు ఇప్పటికి మహానటి అని పిలుస్తున్నారు . కచ్చితంగా మీ ప్రేమను గుర్తు పెట్టుకుంటాను. అదేవిధంగా నా కోపం నాకు నచ్చదు కానీ అది నా తోటి పక్కనున్న వారికి చాలా నచ్చుతుంది .నిజంగా నేను చాలా మొండి దాన్ని ఎవరైనా నన్ను ఈ పని నువ్వు చేయలేవు అంటే కచ్చితంగా చేసి చూపిస్తాను. అది ఎంత రిస్కైనా సరే . అది నిజంగా నాకు నచ్చదు. కానీ ఆ మొండి పట్టుదలే మా కుటుంబంలో నాలో చాలామందికి ఇష్టం. మరి ముఖ్యంగా మహానటి పాత్రకు నేను సూట్ అవ్వనని నన్ను వెక్కిరించారు . అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్లే నువ్వే మహానటి కి కరెక్ట్ అయ్యావు అంటూ పొగిడేసారు. ఆ కామెంట్స్ నా లైఫ్ లో మర్చిపోలేను “అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.