రెబల్ ఫ్యాన్స్ కి శుభవార్త… ప్రభాస్ డబుల్ ధమాకా!

ప్రభాస్… ఇపుడు ఈ పేరు తెలియని ఇండియన్స్ ఉండరంటే నమ్మశక్యం కాదేమో. ప్రభాస్ జీవితం బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అని చెప్పుకోవాలి. ఆ సినిమా పుణ్యమాని ప్రభాస్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఒక్క ప్రభాస్ కే కాకుండా యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇకపోతే మన డార్లింగ్ ప్రస్తుతం ఓ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కేలతో మంచి బిజీగా వున్నాడు. వీటిలో ముందుగా మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ సంక్రాంతి కానుకగా 2023, జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఆ తరువాత ఇక ప్రశాంత్ నీల్ సలార్ సెప్టెంబర్ 28న విడుదల అవ్వగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కే మాత్రం 2024లో రాబోతోంది. కాగా ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 2 సర్ప్రైజ్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అవును, ప్రభాస్ ఫ్యాన్స్‌ కోసం 2 కానుకలు ఇవ్వనున్నారని టాక్. ఒకటి ఆదిపురుష్ నుంచి మరో టీజర్ వస్తుండగా.. ఇక సలార్ నుంచి కూడా ఓ వీడియోను విడుదల చేసేందుకు టీమ్ గట్టిగా ప్లాన్ చేస్తోంది. ఆ రెండు వీడియోలు ఎలా వుండబోతాయో చూడాలి మరి.

కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సాలార్ సినిమా పై అయితే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి శాటిలైట్ హక్కులు భారీ మొత్తం చెల్లించి స్టార్ మా కొనుగోలు చేసినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను టీమ్ విడుదల చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ లుక్ ని చూసిన నెటిజన్లు అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో ఆయన వరదరాజ మనార్ పాత్రలో కనిపించనున్నారు.

Share post:

Latest