నోరు జారి అడ్డంగా బుక్కయిన గరికపాటి.. ఏకేస్తున్న మెగా, అక్కినేని ఫ్యాన్స్!

ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు పై మెగా అభిమానులు మరియు అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార‌ణం గురువారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుతం హర్యానా రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది లాగానే `అలయ్ బలయ్` కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తాను సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలు కలివిడిగా ఉండే వారిని తెలిపారు. అయినప్పటికీ వారి అభిమానులు మాత్రం ఒక హీరో పోస్టుపై మరొకరు పేడ చల్లుకునేవారు.. అటువంటి పరిస్థితిని తాను ఎలాగైనా మార్చాలని ఎంతో ప్రయత్నించినట్లు చిరంజీవి చెప్పుకు వచ్చారు. ఆ తరువాత గరికిపాటి గురించి చిరు మాట్లాడుతూ.. నేను మిమ్మల్ని మొదటిసారి చూడటం. మీ ప్రవచనాలు ఎందరికో ఇన్స్పిరేషన్ గా ఉంటాయి అందులో నేను కూడా ఒకరిని అంటూ గరికిపాటి దగ్గరికి వెళ్లి తలవంచుకుని మరీ చిరంజీవి నమస్కారం చేశారు.

అందులో భాగంగానే గరికపాటి మైక్ తీసుకుని మాట్లాడడానికి ప్రయత్నించిన సమయంలో మహిళా అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చి చిరంజీవితో ఫోటోలు తీసుకుంటున్నారు. వేదిక ఒక్కసారిగా జనాలు ఎక్కువ కావడంతో హడావిడి నెలకొంది. ఇక ప్రతి ఒక్కరి దృష్టి చిరంజీవి పైనే కానీ గరికిపాటి మాటను ఎవరూ పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో అసహనానికి గురైన గరికపాటి చిరంజీవి పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కోపంతో రగిలిపోయిన గరికిపాటి.. ఫోటో సెష‌న్ ఆగిపోతే నేను మాట్లాడతాను.. లేకపోతే నేను వెళ్ళిపోతాను? అందులో ఏం మొహమాటం లేదు? అని చిరంజీవిపై ఘాటుగానే ఫైర్ అయ్యాడు. ఆ సమయంలో గరికిపాటి తాను నందమూరి అభిమాని అని అలాగే అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాన శత్రువు అని.. ఆయన సినిమా పోస్టర్లపై మేము పేడ కొట్టే వాళ్ళం అంటూ చిరు విషయంలో అక్కినేని ఫ్యామిలీని కూడా లాగాడు. ఈ సంఘటనపై స్పందించిన మెగా అభిమానులు అలాగే అక్కినేని అభిమానులు నోరు జారి అడ్డంగా బుక్కయిన గరికిపాటి పై మండిపడుతున్నారు. ప్రస్తుతం గరికపాటి అలా వ్యంగ్యంగా మాట్లాడడం పై నేటిజనులు అతనిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.

Share post:

Latest