వైసీపీలో ఇద్ద‌రు టాప్ లీడ‌ర్ల మ‌ధ్య ఫైటింగ్‌…. చిన్న గ‌ది కోస‌మేనా..!

వైసీపీలో వారిద్ద‌రూ కీల‌క నాయ‌కులు. పైగా.. ఎస్సీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు. దీంతో వారికి సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది. అంతేకాదు.. ఇద్ద‌రికీ కూడా.. కీల‌క‌మైన ప‌ద‌వులు ఇచ్చి గౌర వించారు. అయితే.. ఇప్పుడు ఆ ఇద్ద‌రే.. సెంట‌రాఫ్‌ది టాక్ అయ్యారు. వారే.. ఒక‌రు మేరుగ నాగార్జున‌.. మ‌రొక‌రు.. జూపూడి ప్ర‌భాక‌ర్‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ.. కీల‌క స్థానాల్లో ఉన్నారు సాంఘిక సంక్షేమ శాఖ‌కు మేరుగ నాగార్జున మంత్రిగా ఉన్నారు.

ఇక‌.. జూపూడి ప్ర‌భాక‌ర్‌.. ఇదే శాఖ‌కు స‌ల‌హాదారుగా నియ‌మితుల‌య్యారు. మ‌రి ఇంకేముంది.. ఇద్ద‌రూ కూడా.. ఉన్న‌త విద్యావంతులు.. పైగా.. ఎస్సీ వ‌ర్గానికి చెందిన‌ మేధావులు. ఈ నేప‌థ్యంలో వారి వ్యూహం తో సాంఘిక సంక్షేమ శాఖ‌ను మ‌రింత మెరుగులు పెట్టేందుకు అవ‌కాశం ఉంది. సీఎం జ‌గ‌న్ కూడా ఇదే ఆశించి ఉంటారు. అయితే.. దీనికి బిన్నంగా ఇప్పుడు ఈ ఇద్ద‌రు నాయ‌కులు కూడా .. కీచులాడుకోవ‌డం.. మీడియాకెక్కింది. అది కూడా.. ఒక చిన్న కార్యాల‌యం(పేషీ) కోసం కావ‌డం గ‌మ‌నార్హం.

వివాదం ఏంటంటే.. తాడేపల్లిలో సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యాలయం ఉంది. దీనిలో ఐదో అంతస్తులో త‌న కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని.. జూపూడి భావించారు. ఆ వెంట‌నే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. ఇక‌, ఇంటీరియ‌ర్ డెక‌రేష‌న్ స‌హా.. మౌలిక స‌దుపాయాలు.. ఫ‌ర్నిచ‌ర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక‌, రేపో.. మాపో.. ఆయ‌న ఈ కార్యాల‌యం నుంచి విధులు నిర్వ‌హించేం దుకు రెడీ అయ్యారు.

అయితే..ఇంత‌లోనే.. ఇక్క‌డ‌కు వ‌చ్చిన మంత్రి మేరుగ నాగార్జున‌.. జూపూడి ఏర్పాటు చేసుకున్న కార్యా లయంపై క‌న్నేశౄరు. ఆ కార్యాలయం అప్పటి వరకు ఖాళీగా ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకు న్నారు. తాను గురుకుల సొసైటీకి చైర్మన్‌ అని, సొసైటీలో చైర్మన్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెబు తూ.. జూపూడికి కేటాయించిన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని తాళం వేయించారు. అంతేకాదు.. ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా.. జూపూడి కూడా.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఇక‌, ఈ వివాదం అటు తిరిగి.. ఇటు తిరిగి.. అధిష్టానం వ‌ద్ద‌కు చేరింది. అక్క‌డ అంద‌రూ జూపూడికే మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో.. మంత్రి మేరుగ వెన‌క్కి త‌గ్గిన‌ట్టు స‌మాచారం.

Share post:

Latest