అనుష్క శెట్టి బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన అనుష్క.. గత కొంతకాలం నుంచి సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. వరస ఆఫర్లు తలుపు తడుతున్న ఆమె మాత్రం సినిమాల ఎంపికలో చాలా నెమ్మదిగా వ్యవహరిస్తోంది.
ఇకపోతే టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోల అందరి సరసన ఆడిపడిన అనుష్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే వీరిద్దరి కాంబోలో రెండు చిత్రాలు రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల అవి మిస్ అయ్యాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రాల్లో `సుస్వాగతం` ఒకటి. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రమిది. పవన్ కళ్యాణ్ దేవయాని జంటగా నటించారు. అయితే ఈ చిత్రంలో మొదట అనుష్కను హీరోయిన్గా తీసుకోవాలని భావించారట. కానీ పలు కారణాలవల్ల ఆమెకు బదులుగా దేవయానిని ఫైనల్ చేశారట. ఇక ఆ తర్వాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ `అన్నవరం` అనే సినిమా చేశాడు. ఈ సినిమా సైతం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో కూడా మొదట పవన్ కు జోడిగా అనుష్కను తీసుకోవాలని భావించినా.. వారి కాంబో సెట్ కాలేదు. ఆ తర్వాత అసిన్ ను హీరోయిన్గా ఎంపిక చేశారు. మొత్తానికి అలా పవన్ అనుష్క కాంబోలో రెండు సినిమాలు మిస్ అయ్యాయి.