జగపతి బాబు కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఏదో తెలుసా?

జగపతి బాబు.. సినీ నిర్మాత దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ వారసుడిగా ఈయన సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇప్పటివరకు కెరీర్లో దాదాపు 100 సినిమాలకు పైగానే నటించి తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. గొంతు బాలేదు, డబ్బింగ్ కూడా చెప్పుకోలేడు అని విమర్శించిన వారే ఇప్పుడు జగపతిబాబు డైలాగులు చెప్తుంటే అబ్బో అని నోరు వెళ్ళబెట్టుకుని చూస్తున్నారు. జగపతిబాబు దాదాపు 33 నుండి సినీ ఇండస్ట్రీలో ఒక నటుడిగా రాణిస్తున్నాడు పైగా నటన రాదన్న నటుడే ఏకంగా ఏడు నంది అవార్డులను సొంతం చేసుకున్నాడు.

తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా మోస్ట్ వాంటెడ్ నటుడిగా ఫుల్ బిజీగా మారిపోయాడు. ఆరుపదుల వయసులో కూడా ఎక్కడ తగ్గేదే లేదంటూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. అయితే ఆయన సినిమాల్లో హీరోగా జనాలను ఎక్కువగా ఇంప్రెస్ చేసిన పాత్రలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. ముఖ్యంగా `గాయం` సినిమా గురించి చెప్పాలి. రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో జగపతిబాబు హీరోగా తెరకెక్కిన సినిమా `గాయం`. ఈ సినిమాకు మణిరత్నం ర‌చ‌యిత‌గా వ్యవహరించగా సినిమాలో జగపతి బాబు సరసన రేవతి నటించింది. ఈ సినిమాలో తొలిసారి డబ్బింగ్ చెప్పిన జగపతిబాబు తన గొంతుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో జగపతిబాబు సీరియస్ గా కనిపించినప్పటికీ ప్రేక్షకులను మాత్రం బాగా ఆకర్షించాడు. కానీ ఈ సినిమాలో రేవతి ఎక్కువ క్రెడిట్ కొట్టేసింది. ఈ సినిమా హిట్ అయ్యి జగపతిబాబు కెరీర్ లో ఒక మైల్ స్టోన్ సినిమాగా మారింది.

ఆ తరువాత సౌందర్య సాయికుమార్ ప్రముఖ పాత్రలో నటించిన `అంతఃపురం` సినిమాలో జగపతిబాబు సారాయి వీర్రాజు పాత్ర.. కనిపించేది కాసేపైనా కూడా ఆ పాత్రకు జగపతిబాబుకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో జగపతిబాబు తన నటనతో, ఎమోషన్ తో జనాలను కన్నీళ్లు పెట్టుకునేలా చేశాడు. ఈ సినిమాలో తాను చనిపోయినప్పుడు సీన్ చూసిన ప్రతి ఒక్కరూ జగపతిబాబుకి బాగా కనెక్ట్ అయిపోయారు.

ఇక తర్వాత జగపతిబాబు హీరోగా కెరీర్ పూర్తిగా డల్ అవుతున్న టైం లో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన `లెజెండ్` సినిమాలో విలన్ పాత్రను పోషించి తను నటనతో అదరగొట్టేసాడు. అయితే గతంలో జగపతిబాబు హీరోగా నటించినప్పటి కన్నా విలన్ గా చేస్తున్నప్పుడే ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే ఏదేమైనాప్పటికీ జగపతిబాబు కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర మాత్రం `అంతఃపురం` సినిమాలో సారాయి వీర్రాజు పాత్ర అనే చెప్పుకోవాలి.

Share post:

Latest