హీరో సూర్య ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. మ‌రీ అంత త‌క్కువా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు చేయనవసరం లేదు. కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను సైతం తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. సూర్య నటించిన `ఆకాశమే నీ హద్దురా` వంటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. సూర్య నటించిన ఎన్నో సినిమాలు ఆస్కార్ బరిలో ఉంటున్నాయి.

అయితే ఇటీవల రిలీజ్ అయిన `విక్రమ్` సినిమాలో సూర్య కేవలం నాలుగు నిమిషాలే రోలెక్స్ పాత్రలో చేసినప్పటికీ తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. సూర్య ఇండస్ట్రీలోకి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఆ తరువాత ఏమాత్రం తండ్రి సపోర్ట్ తీసుకోకుండా ఇండస్ట్రీలోకి వ‌చ్చి..ప్ర‌స్తుతం తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. సూర్య తండ్రి బాలీవుడ్ దర్శకుడు శివకుమార్.

అయితే సూర్య 18 సంవత్సరాల వయసులోనే తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక బట్టల దుకాణంలో పనిచేసే వారట. అలా బట్టల దుకాణంలో పనిచేసినందుకుగాను నెలకు 736 రూపాయలు జీతం తీసుకునేవాడట. అయితే సూర్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో అదే తన కెరీర్లో ఫస్ట్ రెమ్యూనిరేషన్ అని వెల్లడించారు. ఇక అతని మొదటి రెమ్యూనేషన్తో వారి తల్లికి చెల్లి బృందాకి చీరలు కూడా కొనిచ్చారట. అలా బట్టల దుకాణంలో పనిచేస్తున్న సూర్యకి సినిమాలపై మక్కువ ఎక్కువ కావడంతో ఎంతో కష్టపడి సినీ అవకాశాలను అందుకొని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా నిలిచాడు.

Share post:

Latest