చిరు ప్ర‌క‌ట‌న‌తో వైసీపీలో ఫుల్ హుషారు…!

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌ల్లో కొత్త హుషారు చోటు చేసుకుందట‌. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి నాయ‌కులు ఆస‌క్తిగా చ‌ర్చించు కుంటున్నార‌ట‌. ఇప్పుడు ఏపీలో ఇలాంటి చ‌ర్చే జ‌రుగుతోంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి ? ఎందుకు? అనుకుంటున్నారా? తాజాగా మెగా స్టార్ చిరంజీవి చేసిన ప్ర‌క‌ట‌నే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అదేంటి? వైసీపీకి పోటీ ఇచ్చేలా.. అధికారం ద‌క్కించుకునేలా.. జ‌న‌సేన‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటాన‌ని చిరు ప్ర‌క‌టిస్తే.. అది వైసీపీకి మైన‌స్ కదా.. మ‌రి ఆ పార్టీ నాయ‌కులు హుషారుగా ఎందుకు ఉంటారు ? ఎలా ఉంటారు ? అనేది ఆస‌క్తిక‌ర విష‌యం.

YCP- Chiranjeevi and Pawan Kalyan: పవన్ దూకుడుకు చిరంజీవితో చెక్...వైసీపీ మైండ్ గేమ్ - OK Telugu

ఇక్క‌డే ఉంది.. అస‌లు వ్యూహం అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. వైసీపీ అధినేత జ‌గ‌న్ అనేక ఆంక్ష‌లు పెట్టారు. సిట్టింగుల నుంచి ఇత‌ర నేత‌ల వ‌ర‌కు .. ఎవ‌రు టికెట్ ద‌క్కించుకోవాల‌న్నా.. గెలుపు గుర్రాల‌కే అవ‌కాశం ఇస్తాన‌ని.. చెప్పారు. ఈ క్ర‌మంలో తాను చేయించే స‌ర్వేల్లో మంచి మార్కులు కూడా ప‌డాల‌న్నారు. అంతేకాదు.. ఏమాత్రం తేడా వ‌చ్చినా మొహ‌మాటం లేకుండా.. ప‌క్క‌న పెడ‌తాన‌ని చెప్పారు. దీంతో స‌హ‌జంగానే.. టికెట్లు ఆశిస్తున్న నాయ‌కులు.. సిట్టింగుల కు ఇబ్బందిక‌ర ప‌రిస్తితి ఏర్ప‌డింది.

దీనికితోడు.. స్థానికంగా ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేకత మాట ఎలా ఉన్నా.. ప్ర‌భుత్వం ప‌రంగా.. సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యా లు పార్టీని అభాసుపాలు చేస్తున్నాయ‌ని నేత‌లు భావిస్తున్నారు. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం.. ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడుతోంది. అదేవిధంగా.. ప‌న్నుల బాదుడు కూడా.. వారికి ఇబ్బందిగా మారింది. కేంద్రంతో స‌ఖ్య‌త ఉంద‌ని చెబుతున్నా.. రాష్ట్రానికి చేయాల్సిన మేలు విష‌యంలో జ‌గ‌న్ ప‌క్క‌దారి ప‌ట్టార‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ గెలుపుపై అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అంటే.. మొత్తంగా ఈ ప‌రిణామాలు.. వైసీపీలోని నాయ‌కుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. అటు క‌ష్ట‌ప‌డుతున్నా.. సీఎం జ‌గ‌న్ టికెట్ ఇస్తారో.. ఇవ్వ‌రో.. అనే టెన్ష‌న్ ఏర్ప‌డింది. మ‌రోవైపు.. టికెట్ ఇచ్చినా.. త‌మ‌పై ప్ర‌జ‌ల‌కు సానుభూతి ఉన్నా.. ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త కొంప‌ముంచుతుంద‌నే భావ‌న ఉంది. ఈ నేప‌థ్యంలోనే నాయ‌కులు చాలా మంది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏదో ఒక టి చేయాల‌నే భావ‌న‌లో ఉన్నారు.

Pawan Kalyan: Pawan Kalyan to fill Samarasankham .. Janasena emergence ceremony today .. | Pawan Kalyan's Janasena Party Formation Day Celebrations At Mangalagiri Guntur District | PiPa News

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌వైపు చూసిన వారు కూడా ప‌దుల సంఖ్య‌లో ఉన్నార‌నేది వాస్త‌వం. అయితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ఒక్క‌డే పార్టీని న‌డిపిస్తున్నాడ‌ని భావిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు మెగా స్టార్ తోడ‌వ‌డంతో.. జ‌న‌సేన‌పై భారీ అంచ‌నాలు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కాదంటే.. జన‌సేన అక్కున చేర్చుకుంటుంద‌నే ఉత్సాహంలో నాయ‌కులు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇదీ.. సంగ‌తి.!!