నువ్వు ఎంత చూపించినా ఆంటీవే.. బిగ్ బాస్ బ్యూటీ దివికి ఘోర అవ‌మానం!

బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. బుల్లితెరపై ప్రసారమైన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ సొట్ట బుగ్గల సుందరి తన అందంతో కుర్ర కారు మనసుల్ని దోచుకుంది. బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ను అందుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంది.

దివి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలతో తెగ సందడి చేస్తుంది. బిగ్ బాస్ ముందు వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా నటించిన దివి.. బిగ్ బాస్ లో అడుగు పెట్టాక సెలబ్రిటీ గా మారిపోయి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా నిలిచి అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసింది. ఇటీవల చిరంజీవి నటించిన `గాడ్ ఫాదర్` సినిమాలో నటించింది కానీ, తన నటనకి ఆ సినిమాలో అంతా మంచి మార్కులు పడలేదు.

 

తాజాగా దివి తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో దివి పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో ఎక్స్పోజింగ్ చేస్తూ రెచ్చిపోయింది. ఇక ఈ ఫోటోలు చూసిన నేటిజనులు దివిని దారుణంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఫోటోల కింద నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.

 

అందులో ఓ నేటిజన్ “నువ్వు ఎంత ఎక్స్పోజ్ చేసినా నువ్వు ఆంటీ వే“ అంటూ నెగిటివ్ కామెంట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ఏదేమైనాప్పటికీ బిగ్ బాస్ బ్యూటీ దివికి మాత్రం ఘోర అవమానం జరిగింది అంటూ దివి అభిమానులు వారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.