జిమ్‌లో జ్యోతిక క‌స‌ర‌త్తులు చూశారా..? నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ త‌గ్గేదే లే!

జ్యోతిక గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఈమె తమిళంలో కొన్ని సినిమాలు నటించగా తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. వారిద్దరి పిల్లలు పెద్దవారు అయ్యాక మళ్లీ సినిమాలపై మక్కువతో జ్యోతిక తాజాగా రీ-ఎంట్రీ ఇచ్చింది.

 

జ్యోతిక రీ-ఎంట్రీ తర్వాత చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల జ్యోతిక షేర్ చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఓ యంగ్ స్టార్ హీరో కూడా ఈ స్థాయిలో వర్కౌట్ చేస్తాడా..? లేదా..? అన్నట్లుగా జ్యోతిక షేర్ చేసిన వర్కౌట్ వీడియో అలా ఉంది మ‌రి. జిమ్ లో జ్యోతిక చేసే కసరత్తులు చూసి అందరూ కూడా నోరు వెళ్ళబడుతున్నారు.

 

 

ప్రస్తుతం జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లో కమర్షియల్ సినిమాలు కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తుంది. జ్యోతిక కమర్షియల్ హీరోయిన్ గా సినిమాలు చేయకున్నా సరే లేడీ ఓరియంటెడ్ సినిమాకు మంచి ఫిజిక్ అవసరమని ఉద్దేశంతో రెగ్యులర్ హీరోయిన్స్ కంటే కూడా ఎక్కువగానే జిమ్ లో కష్టపడుతుంది. నాలుగు పదుల వయసులోనూ జ్యోతిక తగ్గేదే లేదు అంటూ ప్రెజెంట్ హీరోయిన్లకు ధీటుగా ఫిజిక్ మెంటైన్ చేస్తుంది. పైగా హీరోయిన్ గా నటించినప్పటి కంటే ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారంటూ కొందరు అభిమానులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ ప్రస్తుతం జ్యోతిక జిమ్ లో చేసే కసరత్తుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://twitter.com/VasanthTv_India/status/1583079334641745920?s=20&t=3B6x-NTeeqw0mQgQ_c-dNw