పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్.. బన్నీ ఫాన్స్ కు ఇది మంచి పండగ లాంటి వార్త…!

గత సంవత్సరం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంతటి ప్రభంజనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలుపెట్టాడు సుకుమార్.. ఇక ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఎప్పుడు ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది.

ఆ వార్త ఏమిటంటే ఈ సినిమాలో వచ్చే సెకండ్ హాఫ్ లో ఓ కొత్త డిఫరెంట్ క్యారెక్టర్ ద్వారా… ఈ సినిమా క్లైమాక్స్ లో ఎవ్వరు ఊహించని ట్విస్ట్ ఉంటుందట. ఆ ట్విస్ట్ ద్వారా పుష్ప3కి సంబంధం ఉంటుందట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ వార్త బన్నీ అభిమానులకు ఎంతో కిక్ ఇస్తుంది.

ఇక పుష్పా ది రూల్ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో జరుగుతుంది. పార్ట్ వన్ లో అల్లు అర్జున్ తన యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. పుష్పరాజ్ లాంటి పాత్రను అల్లు అర్జున్ చేసి మెప్పించడం అంటే చాలా రిస్క్. అలాంటిది అల్లు అర్జున్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. పుష్ప ది రూల్ కోసం భారతదేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది. ఇలాంటి టైంలో పుష్ప 3 పై కూడా రూమర్ వైరల్ అవుతుంది. మరీ చ్గూడాలి పుష్ప 3 పై మేకర్స్ ఎలా స్పందిస్తారో..?