ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఆ పార్టీకే లాభ‌మా…!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల‌ని కోరుతూ.. సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైం ది. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న హామీ చ‌ట్టంలోనే అసెంబ్లీ సీట్ల పెంపును పేర్కొన్నార‌ని.. పిటిష‌న్‌లో తెలిపారు. కాబ‌ట్టి.. ఏపీలో 225, తెలంగాణ‌లో 119 నుంచి 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్ వివరించారు.

అంతేకాదు.. జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న నిబంధన మేరకు అక్కడ నియోజక వర్గాల ను పెంచడానికి డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింద ని, అదే నిబంధన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా కేంద్రం తగిన చర్యలు తీసుకోలేదని ఆక్షేపిం చారు. జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచుతున్నప్పుడు ఏపీ, తెలంగాణల్లో ఎందుకు పెంచడం లేదని పిటిష‌న‌ర్‌ ప్రశ్నించారు. ఇది రాజ్యాంగంలోని 14, 19, 21వ అధికరణలను ఉల్లంఘించడమేన న్నారు.

క‌ట్ చేస్తే.. అస‌లు ఏపీ, తెలంగాణ‌ల్లో సీట్లు పెంచితే.. ఎవ‌రికి లాభం.? ఎవ‌రికి న‌ష్టం? అనే చర్చ తెర‌మీది కి వ‌చ్చింది. ఎందుకంటే.. ప్ర‌స్తుతం అధికార పార్టీల‌పై .. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. అంతో ఇంతో వ్య‌తిరేక‌త ఉంది. ఏపీని తీసుకుంటే..ఎంత సంక్షేమం అమ‌లు చేస్తున్నా.. ఇంకా ఏదో కావాల‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు.. కోరుతున్నారు. ఇక‌, రాజ‌ధాని విష‌యం మ‌రింత‌గా చ‌ర్చ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో సీట్లు పెరిగితే.. వ్య‌తిరేక ఓటు కూడా పెరిగి.. న‌ష్టం తీసుకువ‌స్తుంద‌నే ఆలోచ‌న వైసీపీలో ఉంది.

ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల విష‌యాన్ని చూసుకుంటే.. ఒక్క టీడీపీకి మాత్ర‌మే సానుకూల ప‌రిణామాలు క‌నిపి స్తున్నాయి. అయితే.. నేత‌లు ఆశించిన విధంగా ప‌నిచేయాల్సి ఉంటుంది. లేక పోతే.. ఇక్క‌డ కూడా ఇ బ్బందులుత‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని చెబుతున్న ప‌వన్‌.. ఖ‌చ్చితంగా.. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఇది లేకుండా.. సీట్లు పెంచినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. ఆయా పార్టీలే న‌ష్ట‌పోతాయ‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.