ఎన్టీఆర్ కోసం క‌స‌క్ లాంటి హీరోయిన్‌ను సెట్ చేసిన కొర‌టాల‌…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అయితే `జనాతా గ్యారేజ్ సినిమా` తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల‌కు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `ఆచార్య` సినిమాతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన కొరటాల, ఎన్టీఆర్‌ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ సినిమాను పకడ్బందీగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

సినిమా ప్రకటించి ఇన్ని రోజులు అవుతోన్నా.. హీరోయిన్‌ పేరును ప్రకటించలేదనే విషయం మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనే దానిపై నెట్టింట రోజుకో వార్త వైర‌ల్ అవుతుంది. ఎన్టీఆర్ 30 సినిమా ప్రస్థావనకు వచ్చిన సమయంలో రష్మిక నుంచి మొదలు ఆలియా భట్, జాన్వీ కపూర్‌, దిశా పటానీ, అనన్య పాండే పేర్లు వినిపించాయి. గత రెండు మూడు రోజులుగా సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ ని సెలెక్ట్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలు వస్తుండగానే మరో వైపు `గీతగోవిందం` స్టార్ రష్మిక మందన్నా ని హీరోయిన్ గాసెలెక్ట్ చేయడం జరిగింది.. కానీ ఆమె ఏకంగా నాలుగు కోట్ల పారితోషికం డిమాండ్ చేసింది అయినా కూడా దర్శకుడు కొరటాల శివ ఓకే చెప్పాడు అంటూ వార్తలు వినిపించాయి. `భరత్ అనే నేను` సినిమాలో మహేష్ బాబుకు జోడీగా, `వినయ విధేయ రామలో` రామ్ చరణ్ కి జోడీగా నటించిన కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీ అయ్యింది. మళ్లీ రామ్ చరణ్ కి జోడీగా `శంకర్` సినిమా తో రీ ఎంట్రీకి రెడీ అవుతుంది.

ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా హీరోగా మారడంతో బాలీవుడ్‌ హీరోయిన్‌ అయితే బాగుంటుందని సినిమా యూనిట్‌ భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. కబ‌ట్టి తప్పకుండా ఎన్టీఆర్ 30 సినిమా లో కియారా అద్వానీ ఉండటం మంచిదే అన్నట్లుగా నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ 30 సినిమాకి కూడా ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని అంటున్నారు.