అదేంటి బాల‌య్య‌కు లేని అవ‌స‌రం చిరుకే ఎందుకు…. తేడా కొడుతోందిగా…!

టాలీవుడ్ ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఏలి, మెగాస్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటుడు చిరంజీవి. అయితే పదేళ్లపాటు సుదీర్ఘ విరామం తర్వాత ఈయన సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అయితే తమిళ బ్లాక్ బాస్టర్ హిట్ ఫిలిమ్` కత్తిని` ఎంచుకుని తెలుగులో `ఖైదీ నెంబర్ 150 గా` రీమేక్ చేసి ప్రేక్షకులు ముందుకు రీఎంట్రీ ఫిల్మ్ గా విడుదలైంది. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పదేళ్లయినా సరే చిరు ఫామ్ తగ్గలేదని ఫాన్స్ లో ఆ క్రేజ్ అలాగే ఉందని ఈ సినిమాతో మరొకసారి నిరూపించుకున్నారు చిరంజీవి. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించారు.

పదేళ్ల తర్వాత సింగిల్ గా వ‌చ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నా మెగాస్టార్ ఆ తర్వాత నుంచి తన సినిమాల్లో ఇతర స్టార్ ను ఎంకరేజ్ చేయడం.. ఇతర స్టార్ కుప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టారు. అలా `సైరా నరసింహారెడ్డిలో` అమితాబచ్చన్ గురువు పాత్రలో నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రల‌లో తమిళ హీరో విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించారు. అయితే భారీ అంచనాల నడుమ సాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే రాబట్ట అందుకోలేకపోయింది. ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

ఇక ఈ సినిమా తరువాత రెండేళ్లకి `ఆచార్య` సినిమాతో చిరు అభిమానుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇందులో అతిధి పాత్రలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించాడు. తండ్రి కొడుకులిద్దరూ కలిసి నటించినా తొలి సినిమా కావడంతో ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు అందరు ఈ సినిమా పై ప్రత్యేక ఆసక్తి చూపించారు. కొరిటాల శివ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా భారీ డిజాస్టర్ అనిపించుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే త్వరలో రిలీజ్ కానున్న `గాడ్ ఫాధ‌ర్` సినిమాలో సల్మాన్ ఖాన్ `వాల్తేరు వీరయ్యతో` రవితేజ కీలక అతిథి పాత్రలో నటించనున్నారు.

అయితే మెగాస్టార్ ఎన్నడూ లేని విధంగా ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారు? అలాంటి అవసరంచిరుకు ఎందుకు వస్తుంది? అన్న వార్తలైతే వేస్తున్నాయి. `గాడ్ ఫాధ‌ర్` సినిమాలో అతిథిగా సల్మాన్ ఖాన్ నటించిన పెద్దగా ఈ సినిమాకి మంచి బజ్ అయితే లేదు. ఇకపోతే చిరంజీవి లాగే సీనియర్ స్టార్ అయిన నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ సోలాగా సై అంటే సై అంటున్న చిరు మాత్రం ఇలా ఇతర స్టార్ హీరోలతో కలిసి సినిమాలు ఎందుకు చేస్తున్నారని.. స్టార్ హీరోల సపోర్ట్ ఎందుకు తీసుకుంటున్నారని మెగాస్టార్ కు మ‌రోక స్టార్ అవసరమా అని ఫ్యాన్స్ వారి నిరిశ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త ప్రధాన చర్చగా మారింది. ఇక ఈ వార్తల‌పై విమర్శకులు కొన్ని వ్యాఖ్యలు కూడా వైరల్ చేస్తున్నారు.

Share post:

Latest