విలన్ రోల్స్ కి విజయ్ సేతుపతి ఎంత డిమాండ్ చేసున్నాడో తెలుసా? షాక్ అవుతారు!

తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి తెలియని సినిమా ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి. మొదట ఓ చిన్న నటుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ సేతుపతి మెల్లమెల్లగా తమిళనాట ఓ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే చాలామంది స్టార్ నటులకి ఇతనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అదేమిటంటే… సాధారణంగా చాలామంది నటులు వాళ్ళకంటూ ఓ పేరు వచ్చాక కేవలం హీరోల పాత్రలనే ఎన్నుకుంటారు. ఇంకేమైనా గెస్ట్ రోల్స్ వస్తే మాత్రం అస్సలు చేయరు. ఇక విలన్ రోల్స్ అయితే చచ్చినా చేయరు.

కానీ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటాడు. ఆ భిన్నత్వమే అతనిని ఓ స్టార్ నటుడిగా నిలబెట్టింది. అవును… గెస్ట్ రోల్స్ ఏమిటి… ఏకంగా విలన్స్ రోల్స్ పోషిస్తూ మంచి బిజీగా వున్నాడు విజయ్ సేతుపతి. అలాచేయడం వలనే తమిళ ఇండస్ట్రీలో ఒక వెర్సిటైల్ నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. తాను ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర హైయెస్ట్ పైడ్ విలన్ గా మారాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు తనని విలన్ గా ఓ సినిమాలో పెట్టుకోడానికి డిమాండ్ ఏ లెవెల్లో ఉందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

లేటెస్ట్ గా భారీ హిట్ సాధించిన “విక్రమ్”, “మాస్టర్” చిత్రాల్లో సాలిడ్ విలన్ పాత్రలు పోషించి అంతకు మించి తన నటనతో ఆకట్టుకున్న సేతుపతి ఇప్పుడు బాలీవుడ్ నుండి బిగ్ ఆఫర్ చేజిక్కించుకున్నాడు. బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ షారుఖ్ ఖాన్ తో తమిళ దర్శకుడు అట్లీ “జవాన్” అనే భారీ ఏక్షన్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి లాక్ కాగా ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాకి ఏకంగా 22 కోట్లు ముట్టజెప్పారట చిత్ర నిర్మాతలు. దీనితో ఇండియన్ సినిమా విషయానికొస్తే ఇప్పుడు అత్యధిక పారితోషకం అందుకుంటున్న విలన్ గా విజయ్ సేతుపతి ముందున్నాడు.