రకుల్ ప్రీత్ న్యూ ఫోటో షూట్… అమ్మడు అందం అమోఘం అంటున్న నెటిజన్లు!

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఫోటో షూట్ షురూ చేసింది. ఎల్లో ట్రెండీ వేర్ లో హొయలు పోతూ కుర్రకారుకి పెద్ద పరీక్షే పెట్టేసింది. కెరీర్ పరంగా టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ తాజాగా బాలీవుడ్లో తన సత్తా చాటడానికి కూడా రెడీ అయిపోయింది. అక్కడ వరుస సినిమాలకు సైన్ చేస్తూ మంచి బిజీగా ఉంటోంది. ఓవైపు సినిమాలతో మరోవైపు సోషల్ మీడియాలో కూడా రకుల్ మంచి బిజీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తాను తీసుకున్న ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకి చాలా దగ్గరగా ఉంటుంది రకుల్.

అవును… మొత్తంగా బాలీవుడ్ కి వెళ్ళాక రకుల్ ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిపోయారు. కఠిన కసరత్తులతో జీరో సైజు సాధించడమే కాకుండా సదరు ఫిగర్ ని గ్లామర్ ఫోటో షూట్స్ రూపంలో ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుంది. తాజాగా వైట్ అండ్ బ్లాక్ టాప్, ప్యాంట్స్ ధరించి సెక్సీ ఫోటో షూట్ చేశారు. రకుల్ హాట్ ఫోటో షూట్ కాకరేపుతుండగా ప్రియుడు జాకీ భగ్నానీ మైండ్ బ్లాక్ అయ్యింది అంటూ లవ్ ఎమోజీ కామెంట్ గా పెట్టి తన తన ఫీలింగ్ తెలియజేశారు. అలాగే మరికొందరు సెలెబ్రిటీలు ఆమె ఫోటో పై కామెంట్ చేశారు. ఇక ఫ్యాన్స్ అయితే లెక్కకు మించిన లైక్స్ తో విరుచుకుపడ్డారు.

సరిగ్గా ఓ ఏడాది క్రితం రకుల్ తన ప్రియుడిగా జాకీని పరిచయం చేసిన సంగతి విదితమే. ఇతడు బాలీవుడ్ లో నటుడు, నిర్మాతగా ఉన్నారు. గతంలో వీరిద్దరి రిలేషన్ గురించి ఎలాంటి పుకార్లు లేకపోవడంతో ఈ విషయం విని అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రేమ విషయం బయటపెట్టిన నాటి నుండి రకుల్ కి పెళ్లెప్పుడన్న ప్రశ్న ఎదురవుతుంది. ఇక టాలీవుడ్ నుండి జెండా ఎత్తేసిన రకుల్ బాలీవుడ్ లో ప్రస్తుతం నాలుగైదు చిత్రాల వరకు చేస్తున్నారు. ఆమె నటించిన అటాక్, రన్ వే 34 ఇటీవల విడుదలయ్యాయి. అవి అనుకున్న స్థాయిలో ఆడకున్నా ఆమెకు అవకాశాలు తగ్గడం లేదు. రకుల్ నటించిన కట్ పులిట్, డాక్టర్ జి, ఛత్రివాలి, థాంక్ గాడ్ హిందీ చిత్రాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి.