నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార..

నయనతార ఇటు తెలుగులోనూ ,తమిళం లోను ,మలయాళంలోనూ నటించి మంచి పేరును గుర్తింపు తెచ్చుకున్నారు.నయనతార తెలుగులో లక్ష్మి ,బాస్ ,యోగి,దుబాయ్ శీను,అదుర్స్ మొదలైన చిత్రాలలో నటించింది .అయితే ఆమె నటించిన శ్రీ రామరాజ్యం సినిమాతో నయన్ కు మరింత గుర్తింపు వచ్చింది.ఈ చిత్రానికి గాను నయనతారకు నంది అవార్డు లభించింది. ఇటీవలే నయనతార కి విఘ్నేష్ శివన్ తో వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత కూడా నయనతార జోరు ఆ మాత్రం తగ్గలేదు .ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది ఇక ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీ లో కూడా అడుగుపెట్టా బోతుంది .

ఇప్పటికే సౌత్ లో అందరికంటే ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న హీరొయిన్ గా నయన్ రికార్డు సొంతం చేసుకుంది , నెక్స్ట్ సినిమాకు గాను నయన్ తన రెమ్యూనిరేషన్ మరింత పెంచినట్టు వినిపిస్తుంది .నయనతార హిందీ లో షారుఖాన్ తో జవాన్ సినిమాలో నటిస్తున్నారు ,ఈసినిమా భారీ బడ్జెట్ సినిమా మరియు షారుఖాన్ నటించడం వలన ఏ సినిమా అంచనాలు కూడా అలానే ఉన్నాయ్ .ఏది ఇలా ఉంటె నయన్ ఈసినిమాకు తన రెమ్యూనిరేషన్ 7 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుసుతుంది .ఇంకా నయనతార నిర్మాతలకు అనేక కండిషన్స్ కూడా పెడుతుందట ,దానితో నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి .

ఇక ఆ కండిషన్స్ ఇలా ఉన్నాయ్ తనకు 7 కోట్ల పారితోషకం తోపాటు తనతో ఉండే స్టాఫ్ కి కూడా లక్సరీ ఫెసిలిటీస్ ,ఇంకా ఫ్లైటు లో బిజినెస్ క్లాస్ టిక్కెట్టు బుక్ చేయాలని కండిషన్ పెట్టిందట .అలాగే తన షూటింగ్ టైం లో తనతో పాటు తన స్టాఫ్ కి కూడా సెపరేట్ క్యారోవాన్ ఇవ్వాలని అడిగిందట .దానితో నిర్మాతలకు తలకు మించిన భారం అవుతుందని భయపడుతున్నారు .కానీ ఇపుడు నయనతార కు ఉన్న క్రేజ్ చూసి ఎంతైనా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సిద్దపడుతున్నారట .అయితే నయనతార ఫ్యూచర్ లో కూడా ఇలానే కండిషన్స్ పెడితే తన సినీ ఫ్యూచర్ ఇలా ఉంటుందో చుడాలిమరి .