ఈ సారి ఏపీలో టాలీవుడ్ స‌పోర్ట్ ఎవ్వ‌రికి… వీళ్లంతా మారిపోయారుగా…!

గ‌త ఎన్నిక‌లు మాత్ర‌మేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. టాలీవుడ్‌పై చ‌ర్చ సాధార‌ణం. టాలీవుడ్ ప్ర‌ముఖులు.. ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తారు? అనేది ఎప్పుడూ.. ఆస‌క్తిగానే ఉంది. వీరు మ‌ద్ద‌తిచ్చిన పార్టీలు.. నాయ‌కులు గెలుస్తున్నారు. గ‌త ఎఎన్నిక‌ల్లో రాష్ట్రంలో జ‌గ‌న్ సునామీ వ‌చ్చినా.. టాలీవుడ్ నుంచి మ‌ద్ద‌తున్న కొంద‌రు నాయ‌కులు గెలుపు గుర్రం ఎక్కారు. వీరిలో గుంటూరు జిల్లా రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ వంటి వారు తెలిసిందే.

ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టాలీవుడ్ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. వాస్త‌వా నికి గ‌త ఎన్నిక‌ల్లో టాలీవుడ్ చాలా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకుంది. చాలా వ‌ర‌కు త‌ట‌స్థంగా ఉంది. బ‌హిరంగంగా ఎవ‌రికీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు. అయితే.. ఆలీ, మోహ‌న్‌బాబు, పోసాని కృష్ణ‌ముర‌ళి, పృధ్వి వంటివారు మాత్రం వైసీపీకి ప్ర‌చారం చేశారు. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున‌.. నంద‌మూరి కుటుంబం ట్వీట్ల‌… రాజ‌కీయంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.

Nandamuri Family - Most Successful Family After Covid

మ‌రోవైపు.. మెగా ఫ్యామిలీ నుంచి చెర్రీ వ‌చ్చి.. ప్ర‌చారం చేస్తాన‌ని.చెప్పినా.. అప్ప‌ట్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ వ‌ద్ద‌న్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఆ కుటుంబం కూడా సైలెంట్ అయింది. ఇక‌, ఇప్పుడు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. టాలీవుడ్ వ్యూహం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. మంచు ఫ్యామిలీ ఈద‌ఫా.. బీజేపీకిమ‌ద్ద‌తిచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇటీవ‌ల మంచు ఫ్యామిలీ ప్ర‌ధానితో భేటీ కావ‌డం..త‌ర్వాత మోహ‌న్‌బాబు బీజేపీకి అనుకూలంగా మాట్లాడ‌డం తెలిసిందే.

A Dream Come True for Mega Family - Cine Chit Chat

ఇక‌, ఈ ద‌ఫా మెగా ప్యామిలీ కూడా.. నేరుగా రంగంలోకి దిగుతుంద‌ని చెబుతున్నారు. డైరెక్ట్‌గా చిరంజీవి జోక్యం లేక‌పోయినా.. ఆయ‌న కుమారుడు చెర్రీ ఈద‌ఫా..జ‌న‌సేన కు అండ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఇక‌, వైసీపీ విష‌యానికివ‌స్తే.. ఇండ‌స్ట్రీలో ఎంత మంది ద‌న్నుగా ఉంటార‌నే ప్ర‌శ్నే. ఎందుకంటే.. ఆలీకి అవ‌కాశం ఇస్తామ‌ని ఇవ్వ‌లేదు. పోసానిని ప‌ట్టించుకోవ‌డం లేదు. పృథ్వీ ఇప్పటికే దూర‌మ‌య్యారు. మంచి ఫ్యామిలీ డిఫెరెంట్ యాంగిల్ తీసుకుంది. దీనికితోడు.. టికెట్ల ధ‌ర‌లు కూడా పెంచారు. ఈ ప‌రిణామాలతో.. టాలీవుడ్ పై ఆస‌క్తి పెరిగింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Share post:

Latest