‘ప్రాజెక్ట్ కె’ పై మ‌రీ చెత్త రూమ‌ర్లు… నాగ్ అశ్విన్ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌…!

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు నాగ్ అశ్విన్ తన మొదటి సినిమాతోనే తనలోని టాలెంట్ ని చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు. తన రెండో సినిమాగా టాలీవుడ్ మహానటిగా పేరుపొందిన సావిత్రి జీవిత చరిత్రను ఆధారం చేసుకునే మహానటి అనే సినిమా తీసి జాతీయస్థాయిలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ దర్శకులు జాబితాలో చేరిపోయాడు.

Fan asks Nag Ashwin about Prabhas's Project K poster. Director shares new update - Movies News

తన మూడో సినిమాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో సైన్స్ ఫిక్షన్ ట్రైన్ ట్రావెల్ సినిమాని రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా స్టోరీ పై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా విడుదలైన ఒకే ఒక జీవితం సినిమా కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన సినిమా. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ కె సినిమా కథ‌ ఓకే ఓకే జీవితం సినిమా కథను పోలి ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Amitabh Bachchan joins Prabhas, Deepika Padukone in Nag Ashwin's untitled multilingual project-Entertainment News , Firstpost

ఆ కామెంట్‌ల‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ తనదైన స్టైల్ లో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు నాగ్ అశ్విన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ ఏమిటంటే పార్య‌డైజ్ వద్ద బస్సు దిగిన వారంత బిర్యానీ తినరు అంటూ నాగేశ్విన్ తన సోషల్ మీడియా ద్వారా ఆ పోస్ట్ షేర్ చేశాడు. నాగ్ అశ్విన్ ఆ పోస్ట్ తన సినిమాపై వస్తున్న కామెంట్లపై ఆ పోస్ట్ పెట్టాడని అర్థమవుతుంది. ప్రాజెక్ట్ కె సినిమాపై వస్తున్న చెత్త రూమర్లకు కామెంట్ లపై నాగ్ అశ్విన్ తనదైన స్టైల్ లో చెక్ పెట్టారని అర్థం అవుతుంది.

Share post:

Latest