మెగాస్టార్ ‘ గాడ్ ఫాథ‌ర్ ‘ సెన్సార్ కంప్లీట్‌… సినిమా టాక్ ఎలా ఉందంటే…!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగా స్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాథ‌ర్ సెన్సార్ పూర్తి చేసుకుంది. బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన ఈ సినిమా పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కింది. మళ‌యాళంలో హిట్ అయిన లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా వ‌స్తోన్న గాడ్ ఫాథ‌ర్‌కు మోహ‌న‌రాజా ద‌ర్శ‌కుడు. న‌య‌న‌తార హీరోయిన్‌.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు యూ / ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. సెన్సార్ యూనిట్ నుంచి కూడా సినిమాకు చాలా మంచి స్పందన వచ్చింద‌ని… ఆడియెన్స్ రెస్పాన్స్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. గాడ్ ఫాథ‌ర్ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న రిలీజ్ అవుతోంది.

Share post:

Latest