ఆ డేటింగ్ హీరోయిన్‌తో బ‌న్నీ అలా ఫిక్స్ అయ్యాడా…!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వీరిద్దరి మధ్య వచ్చిన క్రేజీ కాంబినేషన్ `పుష్ప` సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసి ఎంతో ఘనవిజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి సెన్సేషన్ క్రియేట్ చేసి సూపర్ బ్లాక్ బ‌స్టర్ హిట్ అయింది. `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉందని విమర్శకులతో ప్రశంసలు అందుకుంది. దీంతో `పుష్ప 2 ` పై ప్రేక్షకులకి బోలెడన్ని అంచనాలు క్రియేట్ చేశారు.

`పుష్ప` సినిమాకు పార్ట్-2 `పుష్పా ది రూల్` అనే పేరుతో ఆ సినిమాను సెట్స్ మీదకు సుకుమార్ తీసుకొస్తున్నారు. అలా ఈ క్రమంలోనే పుష్ప2 సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాకి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్ప1 లో సౌత్ లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంతా మొదటిసారి ఐటమ్ సాంగ్ చేసింది. అది సూపర్ హిట్ అయింది. ఊ అంటావా మామ అంటావా మామ అనే సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ఇక పుష్ప 2 లో కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉందని సమాచారం అందుతుంది. అయితే పార్ట్ వన్ లో సమంత చేసిన ఐటమ్ సాంగ్, సెకండ్ పార్ట్ లో బాలీవుడ్ బ్యూటీతో చేయించాలని అనుకుంటున్నారట. ‌ అయితే ఈ ఐటమ్ సాంగ్ కోసం ఇప్పటికే చాలామంది పేర్లు వినిపించగా ఇప్పుడు ఐటమ్ బ్యూటీ అయినా మలైకా అరోరా ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి

.

మ‌లైకా ఇప్ప‌టికే 46 ఏళ్ల వ‌య‌స్సులో ఉంది.. ఆమె భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసి త‌న కంటే ప‌దేల్లు చిన్నోడు అయిన అర్జున్ క‌పూర్‌తో డేటింగ్‌లో ఉంది. పైగా ఆమె ఐటెం నెంబ‌ర్ల‌కు ప్ర‌సిద్ధి. మ‌రి బ‌న్నీతో ఆమె ఐటెం సాంగ్ చేస్తే ఏ రేంజ్‌లో ర‌చ్చ ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు.