RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆసక్తి రేపిన చిత్రమని చెప్పవచ్చు.ఈ సినిమాని రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల సైతం ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకి ఉపయోగించిన గ్రాఫిక్స్ వల్ల ఈ సినిమా భారీగానే కలెక్షన్లను రాబట్టింది. అందుచేతనే ఈ సినిమా చాలామంది ఆస్కార్ అవార్డుకు ఇండియా నుంచి నామినేట్ కావచ్చు అని అందరూ భావించారు. ఇక అంతే కాకుండా గత నాలుగు ఐదు రోజుల నుంచి సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఈ విషయం గురించి వార్తలు వినిపించేవి.
అందరీ ఆశల్ని వోమ్ము చేస్తూ.. ఇండియా నుంచి మరో సినిమా ఆస్కార్ కు నామినేట్ అవడం జరిగింది. దీంతో RRR కు నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. లాస్ట్ ఫిల్మ్ చలో అనే గుజరాతి సినిమా ఆస్కార్బరిలో నిలిచినట్లుగా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలియజేయడం జరిగింది. బెస్ట్ ఫిలిం క్యాటగిరిలో ఇండియా నుంచి ఈ చిత్రం నామినేట్ అయ్యిందని సమాచారం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నవీన్ తన చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. చిన్న వయసు నుండి సినిమాలపై ఎలా ఆకర్షిస్తుడు అవుతారు.. ఎలా తన ఇష్టాన్ని పెంచుకుంటాడనే కాన్సెప్ట్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. అందుచేతనే ఈ సినిమా 2023 ఆస్కార్ బరిలో ఉన్నట్లుగా సమాచారం.
ఇక ఈ చిత్రం గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా డైరెక్టర్ ఎంత అద్భుతంగా ఆవిష్కరించారు. ఒక 9 ఏళ్ల బాలుడి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం అంటే అంత సులువైన విషయమేమీ కాదు కదా సహజంగా ఉండాలి ముఖ్యంగా గ్రాఫిక్స్ కంటే సహజత్వం ఎక్కువగా ఉండాలట. అలాగే చక్కని కాన్సెప్ట్ తో కూడా సినిమాని తెరకెక్కించి ఉండాలి.. అయితే RRR సినిమా గ్రాఫిక్స్ పరంగా అద్భుతంగా ఉన్న సహజత్వం లోపించిందని చెప్పవచ్చు.